Health Tips | ఇంట్లో నాఫ్తలీన్ బాల్స్ వాడుతున్నారా..? అయితే ఈ ప్రమాదాల గురించి తెలుసుకోవాల్సిందే..!
Health Tips | చలికాలం (Winter) లో బీరువాల్లో దుస్తులను భద్రపరిచేటప్పుడు నాఫ్తలీన్ బాల్స్ (Napthalin balls) వేయడం చాలా ఇళ్లలో సాధారణమే. అల్మారాల్లోని దుస్తుల్లోకి బొద్దింకలు చేరకుండా, సువాసన కోసం వీటిని ఉపయోగిస్తుంటారు. కొందరు బాత్రూమ్లు (Bathrooms), టాయిలెట్ (Toilets) లలోనూ ఈ నాఫ్తలీన్ బాల్స్ వేస్తుంటారు.
Health Tips : చలికాలం (Winter) లో బీరువాల్లో దుస్తులను భద్రపరిచేటప్పుడు నాఫ్తలీన్ బాల్స్ (Napthalin balls) వేయడం చాలా ఇళ్లలో సాధారణమే. అల్మారాల్లోని దుస్తుల్లోకి బొద్దింకలు చేరకుండా, సువాసన కోసం వీటిని ఉపయోగిస్తుంటారు. కొందరు బాత్రూమ్లు (Bathrooms), టాయిలెట్ (Toilets) లలోనూ ఈ నాఫ్తలీన్ బాల్స్ వేస్తుంటారు. అయితే వీటిలో ఉండే నాఫ్తలీన్ ఓ రసాయన పురుగుమందు. దీని వాసనను ఎక్కువసేపు పీల్చడం, పొరపాటున మింగడం, చర్మానికి ఎక్కువగా తగలడం ఆరోగ్యానికి హాని కలిగించవచ్చని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
నాఫ్తలీన్ బాల్ కరగకపోయినా వాసన వస్తుంది. గది ఉష్ణోగ్రత వద్దే దాని అణువులు నెమ్మదిగా గాల్లోకి చేరుతాయి. దీన్నే ‘సబ్లిమేషన్’ అంటారు. అందుకే అల్మారా తెరిచిన వెంటనే ఘాటైన వాసన వస్తుంది. మూసి ఉన్న అల్మారాల్లో గాలి ప్రసరణ తక్కువగా ఉంటే ఆవిర్లు పేరుకుపోయే అవకాశం ఉంటుంది. అల్మారా తలుపులు తెరిచి గాలి ప్రసరించేలా చేయడంవల్ల ఆవిరి కొంత తగ్గి ఘాటు వాసన తగ్గుతుంది.
నాఫ్తలీన్ బాల్స్ వాసనను తరచూ పీల్చడం సురక్షితం కాదు. తలనొప్పి, వికారం, తల తిరగడం, కళ్లకు-ముక్కుకు మంట, నీరసం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ స్మెల్ ఎక్కువ మోతాదులో శరీరంలోకి వెళ్తే ఎర్ర రక్తకణాలు దెబ్బతిని రక్తహీనతకు దారితీయవచ్చు. కాలేయం, మూత్రపిండాలు, నాడీ వ్యవస్థపైనా ప్రభావం పడే అవకాశం ఉంది.
పిల్లల విషయంలో మరింత జాగ్రత్త అవసరం. బాల్స్ చిన్న పరిమాణంలో ఉండటం, పిల్లలకు వస్తువులను నోట్లో పెట్టుకునే అలవాటు ఉండటం కారణంగా ప్రమాదం పెరుగుతుంది. నాఫ్తలీన్ బాల్‌ను పొరపాటున మింగితే తీవ్ర విష ప్రభావం కలగవచ్చు. అందుకే పిల్లలు ఉండే గదుల్లో, వారు నిద్రించే ప్రదేశాల్లో వీటిని వాడకపోవడం మంచిది. ఆహార పదార్థాలు పెట్టే డబ్బాల్లో వీటిని నిల్వ చేయకూడదు.
ఈ నాప్తాలిన్ బాల్స్ పెంపుడు జంతువులకు కూడా ప్రమాదకరమే. కుక్కలు, పిల్లులు నాఫ్తలీన్ బాల్స్‌ను కొరికినా, మింగినా తీవ్ర అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. వాంతులు, కడుపు నొప్పి, నీరసం, రక్తహీనత, నాడీ సంబంధ సమస్యలు, అవయవాల దెబ్బతినడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. నేలపై వీటిని వదిలేయడం మరింత ప్రమాదకరం.
సాధారణంగా బాత్రూమ్లు, టాయిలెట్లలో దుర్వాసన పోగొట్టేందుకు లేదా పురుగులను తరిమేందుకు నాఫ్తలీన్ బాల్స్ పెడుతుంటారు. అయితే వాటిని అలా వాడకూడదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. గాలి ప్రసరణ సరిగా లేని ప్రదేశాల్లో ఆవిర్లకు ఎక్కువగా గురయ్యే అవకాశం ఉంటుంది. దాంతో ఘాటైన వాసన వస్తుంది. నిత్యం ఆ వాసన పీల్చుకోవడం ఆరోగ్యానికి హాని చేస్తుంది.
నాఫ్తలీన్ బాల్స్‌కు బదులుగా దుస్తులను శుభ్రంగా, పూర్తిగా ఆరబెట్టి భద్రపరచడం మంచి పద్ధతి. గాలి చొరబడని కంటైనర్లు లేదా గార్మెంట్ బ్యాగుల్లో వీటిని ఉంచాలి. అల్మారాలను పొడిగా, అస్తవ్యస్తంగా లేకుండా చూసుకోవాలి. ఎక్కువకాలం నిల్వచేసిన దుస్తులను మధ్య మధ్యలో బయటకు తీసి గాలి తగిలించాలి. దుస్తులను ఉతకడంవల్ల కొంత రసాయన అవశేషం తొలగవచ్చు.
కానీ పూర్తిగా పోతుందని చెప్పలేం. దుస్తులకే కాకుండా అల్మారా, స్టోరేజ్ బాక్సుల్లోనూ ఆవిర్లు లేదా అవశేషాలు ఉండొచ్చు. అందుకే దుస్తులను ఉతకడంతోపాటు వాటిని బాగా గాలి తగిలేలా చేయాలి. అల్మారా, నిల్వ ప్రదేశాన్ని కూడా శుభ్రం చేసి గాలి ప్రసరించేలా చేసిన తర్వాతే మళ్లీ ఉపయోగించడం మంచిది.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | ఇంట్లో నాఫ్తలీన్ బాల్స్ వాడుతున్నారా..? అయితే ఈ ప్రమాదాల గురించి తెలుసుకోవాల్సిందే..!
Amitabh Bachchan | మరోసారి వైరల్ అవుతున్న అమితాబ్ బచ్చన్ డైట్.. ఇంతకీ ఆయన ఏం తీసుకుంటారు..?
judge’s Minor son drives Car hits scooter | లగ్జరీ కారు నడిపిన జడ్జి మైనర్ కుమారుడు.. స్కూటీని ఢీకొట్టడంతో వ్యక్తి మృతి
X Money | ఇక ఎక్స్ ద్వారా కూడా డబ్బులు పంపొచ్చు.. కొత్త ఫీచర్ ప్రకటించిన ఎలాన్ మస్క్..!
Dharman | రజనీకాంత్ ‘ధర్మన్’లో నయనతార.. ఆరోసారి జోడీ కడుతున్న సూపర్‌స్టార్, లేడీ సూపర్‌స్టార్!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

