MLA Kova Lakshmi | పింఛన్, రేషన్ కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియ : ఎమ్మెల్యే కోవలక్ష్మి
ఏ ప్రభుత్వాలు అయినా అధికారంలో కి వచ్చినప్పుడు అర్హులైన లబ్ధిదారులకు పింఛన్.. రేషన్ కార్డుల పంపిణీ చేయడం నిరంతర ప్రక్రియని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి అన్నారు.
నార్నూర్, నవంబర్ 18: ఏ ప్రభుత్వాలు అయినా అధికారంలో కి వచ్చినప్పుడు అర్హులైన లబ్ధిదారులకు పింఛన్.. రేషన్ కార్డుల పంపిణీ చేయడం నిరంతర ప్రక్రియని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి అన్నారు. బుధవారం ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్, గాదిగూడలోని రైతు వేదికలు పింఛన్ పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని లబ్ధిదారులకు పింఛన్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వృద్ధులకు కూడా పింఛన్ అందించే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు.
మారుమూల నార్నూర్, గాదిగూడ మండలాల అభివృద్ధి సంక్షేమానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజా పాలనలో పంచాయతీలలో సర్పంచుల పాలన కీలకమన్నారు. వర్ష భావ పరిస్థితులలో నీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని.. సమస్యలు గుర్తించి తన దృష్టికి తీసుకొస్తే జిల్లా కలెక్టర్ తో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. పలు సమస్యలను సర్పంచులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా.. తప్పకుండా సంబంధిత అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా కృషి చేస్తామన్నారు. ఈ సమావేశంలో ఎంపీడీవోలు పుల్లారావ్, శ్రీనివాస్, సిడిపిఓ శారద, ఎంపీ ఓలు మహేష్, గంగారెడ్డి, నాయకులు ఉన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA Kova Lakshmi | పింఛన్, రేషన్ కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియ : ఎమ్మెల్యే కోవలక్ష్మి
ప్రజా సమస్యలకు దిక్కేది?.. మంత్రి ముఖం చాటేయడంపై సర్పంచుల నిరసన
Students | స్కాలర్ షిప్స్ విడుదల చేయాలి.. రోడ్డెక్కిన విద్యార్థినులు.. వీడియో
పొన్నేకల్ వద్ద మినీ వ్యాన్ బోల్తా
‘ఎన్నికల ప్రక్రియపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలి’
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

