10 voters listed as Same Name | యూపీలో ‘వికాస్ యాదవ్’ పేరుతో 10 మంది ఓటర్లు.. 9 మంది అధికారులపై చర్యలు
10 voters listed as Same Name | ఉత్తరప్రదేశ్‌లో ఒకే వ్యక్తి పేరుతో పది మంది ఓటర్లు ఉన్నారు. ‘వికాస్ యాదవ్’ పేరుతో తప్పుగా పది మంది ఓటర్లను నమోదు చేసినట్లు సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో తొమ్మిది మంది ఎన్నికల అధికారులు, సిబ్బందిపై చర్యలు చేపట్టారు.
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో ఒకే వ్యక్తి పేరుతో పది మంది ఓటర్లు ఉన్నారు. ‘వికాస్ యాదవ్’ పేరుతో తప్పుగా పది మంది ఓటర్లను నమోదు చేసినట్లు సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో తొమ్మిది మంది ఎన్నికల అధికారులు, సిబ్బందిపై చర్యలు చేపట్టారు. (10 voters listed as Same Name) అజంగఢ్ జిల్లాలో ‘వికాస్ యాదవ్’ పేరుతో 10 మంది ఓటర్లను తప్పుగా నమోదు చేసినట్లు ఎస్పీ ఆరోపించింది. ఒక ప్రెస్ మీట్లో ఆ వ్యక్తిని ప్రవేశపెట్టింది. దీనిపై విచారణ జరుపాలని ఆ పార్టీ డిమాండ్ చేసింది.
కాగా, ఉత్తరప్రదేశ్ ఎన్నికల కమిషన్ ఈ ఫిర్యాదుపై స్పందించింది. అజంగఢ్ జిల్లా ఎన్నికల అధికారి నుంచి నివేదిక కోరింది. ఒక వ్యక్తి పేరు మాత్రమే వికాస్ యాదవ్ కాగా, మిగిలిన 10 మందిని అదే పేరుతో తప్పుడు ఓటర్లుగా నమోదు చేసినట్లు బయటపడింది. ఓటర్ల జాబితాల నిర్వహణలో సహాయపడే ఒక కంప్యూటర్ సహాయకుడు, ఐదుగురు బూత్ స్థాయి అధికారులు ఈ పొరపాటుకు బాధ్యులని తేలింది. దీంతో వారిని వెంటనే ఓటర్ల జాబితా విధుల నుంచి తొలగించారు. ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 32 కింద చట్టపరమైన చర్యలకు కూడా ఆదేశాలు జారీ చేశారు.
మరోవైపు పిలిభిత్‌లో కూడా ఓటర్ల వివరాలలో 10,000కు పైగా అనధికారిక మార్పులు జరిగినట్లు ఎస్పీ ఆరోపించింది. యూపీ ప్రధాన ఎన్నికల అధికారి నవదీప్ రిన్వా స్పందించారు. రాష్ట్రవ్యాప్త విచారణకు ఆదేశించారు. అజంగఢ్‌లోని ఇతర అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ఓటర్ల జాబితాలను తనిఖీ చేసి, వారంలోగా నివేదిక సమర్పించాలని జిల్లా ఎన్నికల అధికారిని కోరడంతో ఓటర్ల జాబితాలకు సంబంధించిన అనేక పొరపాట్లు వెలుగులోకి వచ్చాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
10 voters listed as Same Name | యూపీలో ‘వికాస్ యాదవ్’ పేరుతో 10 మంది ఓటర్లు.. 9 మంది అధికారులపై చర్యలు
PV Sindhu | ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో పీవీ సింధు ఓటమి.. టైటిల్ గెలుచుకున్న వరల్డ్ నెంబర్ వన్ అన్ సె యంగ్
KTR | రాహుల్‌గాంధీకి తెలంగాణ ఒక ఏటీఎంగా మారింది : కేటీఆర్
Health Tips | ఇంట్లో నాఫ్తలీన్ బాల్స్ వాడుతున్నారా..? అయితే ఈ ప్రమాదాల గురించి తెలుసుకోవాల్సిందే..!
Amitabh Bachchan | మరోసారి వైరల్ అవుతున్న అమితాబ్ బచ్చన్ డైట్.. ఇంతకీ ఆయన ఏం తీసుకుంటారు..?
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

