Cobra Movie | కోబ్రా మూవీ ఓటీటీ డేట్ కన్ఫార్మ్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Cobra Movie On Ott | చాలా కాలం తర్వాత చియాన్ విక్రమ్ ‘మహాన్’తో మంచి కంబ్యాక్ ఇచ్చాడు. అదే జోష్‌లో ‘కోబ్రా’ చిత్రంతో ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ అంచనాల మధ్య ఆగస్టు 30న విడుదలైన ఈ చిత్రం అశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది.
Cobra Movie On Ott | చాలా కాలం తర్వాత చియాన్ విక్రమ్ ‘మహాన్’తో మంచి కంబ్యాక్ ఇచ్చాడు. అదే జోష్‌లో ‘కోబ్రా’ చిత్రంతో ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ అంచనాల మధ్య ఆగస్టు 30న విడుదలైన ఈ చిత్రం అశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. ఇప్పటికే చాలా వరకు థియేటర్లలో నుండి కోబ్రా వెళ్ళిపోయింది. అయితే ఈ చిత్రంలో విక్రమ్ నటనకు మాత్రం గొప్ప ప్రశంసలు దక్కాయి. విభిన్న గెటప్స్‌లో విక్రమ్ నటించిన తీరుకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇక ఈ చిత్రం ఓటీటీ డేట్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. తాజాగా డిజిటల్ రిలీజ్‌కు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది.
కోబ్రా మూవీ డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ సోని లివ్ దక్కించుకుంది. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 30 నుండి డిజిటల్ స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అయితే అన్ని తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతుందా లేదా అనేది క్లారిటీ రావాల్సి ఉంది. ఈ చిత్రంలో విక్రమ్ ద్విపాత్రాభినయంతో ఆకట్టుకుంటుంది. కేజీఎఫ్ భామ శ్రీనిధి శెట్టి, మృనాళిని రవి హీరోయిన్లుగా నటించారు. ప్రముఖ క్రికెటర్ ఇర్ఫాన్ ఖాన్ కీలకపాత్రలో నటించాడు. మలయాళ నటుడు రోషన్ మాథ్యూ ప్రతినాయకుడి పాత్రలో నటించాడు. ఏఆర్. రెహమాన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని సెవెన్ స్క్రీన్ స్టూడీయో పతాకంపై ఎస్.ఎస్ లలిత్‌కుమార్ నిర్మించాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donations | తిరుమల దేవస్థానానికి విరాళాల వెల్లువ
Passengers sit on tracks | యువకుడిపై ఆర్పీఎఫ్ సిబ్బంది దాడి.. పట్టాలపై కూర్చొని రైలును అడ్డుకుని ప్రయాణికుల నిరసన
PM Modi | మోదీకి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఫోన్.. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు రావాలని ఆహ్వానం
TGICCC | ఐసీసీసీలో దక్షిణాది రాష్ట్రాల పోలీసు సమన్వయ కమిటీ భేటీ
bathukamma celebrations | ఒరెగాన్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రాండ్‌గా బతుకమ్మ, దసరా వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

