టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు (Sudheer Babu) నటిస్తోన్న యాక్షన్ థ్రిల్లర్ హంట్. సుధీర్ బాబు మరోసారి పోలీసాఫీసర్‌గా కనిపించబోతున్నాడు. ఇప్పటికే మేకర్స్ విడుదల చేసిన టీజర్, ఫస్ట్ లుక్కు, ఈ సినిమా నుంచి విడుదలైన పాపతో పైలం (Papa Tho Pailam hook step) లిరికల్ వీడియో సాంగ్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది.
ఈ సాంగ్‌లో వచ్చే హుక్ స్టెప్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తోంది. సినిమా ప్రమోషన్స్ ను కొత్తగా చేస్తోంది సుధీర్ బాబు టీం. ఈ పాట హుక్ స్టెప్‌ను రీక్రియేట్ చేసే వారిలో లక్కీ విన్నర్లకు ఆరు రోజుల పాటు ప్రతీ రోజు ఒక్కో విన్నర్ కు రూ.10 వేలు బహుమతిగా ఇవ్వనున్నట్టు ప్రకటించింది టీం. భవ్య క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తోన్న ఈ చిత్రంలో ప్రేమిస్తే ఫేం భరత్, శ్రీకాంత్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
నానితో కలిసి నటించిన V సినిమా తర్వాత రెండోసారి కాప్ రోల్లో కనిపించనున్నాడు సుధీర్ బాబు. గిబ్రాన్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నాడు. ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి..చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఈ సారి ఎలాగైనా మంచి బ్రేక్ అందుకోవాలని చూస్తున్నాడు సుధీర్ బాబు.
PARTICIPATE & WIN!!
Reel the #PapaThoPailam signature step & tag @BhavyaCreations !!!
6 days, 6 different winners will receive prizes worth 10K. Not just that, you may stand a chance to dance at our pre release event too 😊👍#HuntTheMovie pic.twitter.com/i8T3EPzbQK— Sudheer Babu (@isudheerbabu) October 15, 2022
పాపతో పైలం లిరికల్ వీడియో సాంగ్..
Read Also : Nandamuri Balakrishna | సినిమాల్లోకి బాలకృష్ణ చిన్నకూతురు..క్రేజీ టాక్‌లో నిజమెంత ?
Read Also : Yashoda | డేట్‌ను రౌండప్ చేస్తూ.. యశోద సినిమా విడుదలపై సమంత టీం హింట్ ..!
Read Also :Anushka Shetty | కాంతార సినిమాను థియేటర్లలో మాత్రమే చూడండి : అనుష్క