అగ్ర నటుడు నాగార్జున ప్రస్తుతం వందో చిత్రంలో నటిస్తున్నారు. సుదీర్ఘ కెరీర్లో కథల పరంగా ప్రయోగాలు, అపూర్వ విజయాలతో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను సృష్టించుకున్నారాయన. ఈ నేపథ్యంలో ఆయన 100వ సినిమా అప్డేట్స్ గురించి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రా కార్తీక్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్నది.
తాజా సమచారం ప్రకారం ఈ చిత్రాన్ని నాగార్జునకు బాగా కలిసొచ్చిన మే 23వ తేదీన విడుదల చేయబోతున్నారని వార్తలొస్తున్నాయి. ఆ డేట్ నాగార్జునకు సెంటిమెంట్ అని చెబుతారు. తొలి చిత్రం ‘విక్రమ్’తో పాటు అక్కినేని మూడు తరాలు కలిసి నటించిన ‘మనం’ చిత్రాలు మే 23న విడుదలయ్యాయి.
తన వందో సినిమా రిలీజ్ విషయంలో కూడా నాగార్జున అదే సెంటిమెంట్‌ను రిపీట్ చేయబోతున్నారని ఫిల్మ్ నగర్ టాక్. ఈ చిత్రానికి ‘100నాటౌట్’ ‘లాటరీ కింగ్’ అనే టైటిల్స్ ప్రచారంలో ఉన్నాయి.