Ram charan | గల్లీ గల్లీలో విశ్వక్సేన్కు అభిమానులున్నారు : ఓరి దేవుడా ఈవెంట్లో రాంచరణ్
అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో వస్తున్న ఓరి దేవుడా (Ori Devuda) ప్రీ రిలీజ్ ఈవెంట్ కు టాలీవుడ్ స్టార్ హీరో రాంచరణ్ చీఫ్ గెస్టుగా హాజరయ్యాడు. ఈవెంట్లో రాంచరణ్ మాట్లాడుతూ..అశ్వత్ మారిముత్తు తెరకెక్కించిన ఒరిజినల్ వెర్షన్‌ను నేను చూడలేదు. కానీ తెలుగు వెర్షన్ ట్రైలర్ చాలా అద్బుతంగా, ఎంగేజింగ్‌గా, ఫన్నీగా ఉందన్నారు.
టాలీవుడ్ (Tollywood)యంగ్ హీరో విశ్వక్ సేన్ (Vishwak Sen), మిథిలా పాల్కర్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ఓరి దేవుడా (Ori Devuda). అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు టాలీవుడ్ స్టార్ హీరో రాంచరణ్ చీఫ్ గెస్టుగా హాజరయ్యాడు.
ఈవెంట్లో రాంచరణ్ మాట్లాడుతూ..అశ్వత్ మారిముత్తు తెరకెక్కించిన ఒరిజినల్ వెర్షన్‌ను నేను చూడలేదు. కానీ తెలుగు వెర్షన్ ట్రైలర్ చాలా అద్బుతంగా, ఎంగేజింగ్‌గా, ఫన్నీగా ఉంది. బాస్ ఆఫ్ కామెడీ వెంకటేశ్ గారున్నారు. ఆయనది చిన్న పాత్ర అయినా చాలా ఇంపాక్ట్‌ఫుల్‌గా ఉంది. వెంకటేశన్నా..నేను మీకోసమైనా ఈ సినిమా చూస్తా. మిథిలా పాల్కర్‌కు నేను, ఉపాసన అభిమానులం. మిథిలా పాల్కర్ ‘లిటిల్ థింగ్స్’ అనే ఓటీటీ సిరీస్ చాలా అద్బుతంగా ఉంటుంది. మిథిలా పాల్కర్ ఓటీటీ సూపర్ స్టార్ అంటూ ప్రశంసించాడు.
‘ఆంధ్రప్రదేశ్, తెలంగాణ గల్లీ గల్లీలో ఈ పేరు తెలియని వాళ్లు లేరు. అతి తక్కువ సమయంలో ఎక్కువ హిట్స్‌తో ఫలక్‌నుమా నుంచి రాజమండ్రి వరకు..వైజాగ్ నుంచి చిత్తూరు వరకు గల్లీ గల్లీలో విశ్వక్సేన్కు అభిమానులున్నారు. ఫలక్‌నుమాదాస్, హిట్ సినిమాలు చూశాను. విశ్వక్సేన్కు యూత్ ఫ్యాన్స్ ఉన్నారు. విశ్వక్ సేన్ కు సినిమాల్లో హీరో కన్నా ఆయన బయట పర్సనాలిటీకి నేను పెద్ద అభిమానిని అక్టోబర్ 21న సినిమా థియేటర్లలో విడుదలవుతుంది. ఈ సినిమా వల్ల దీపావళి పండగ బాగుంటదా..? లేదంటే దీపావళి వల్ల సినిమా బాగుంటదా..?నాకు తెలియదు. కానీ మీ అందరి ఆశీస్సులు ఓరి దేవుడా టీంకు ఉండాలని కోరుకుంటున్నానన్నాడు’ రాంచరణ్.
ఈ చిత్రంతో బాలీవుడ్ భామ మిథిలా పాల్కర్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవుతుంది. ఓరి దేవుడా చిత్రాన్ని పీవీపీ సినిమా, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లు సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి.
Read Also : Nandamuri Balakrishna | సినిమాల్లోకి బాలకృష్ణ చిన్నకూతురు..క్రేజీ టాక్‌లో నిజమెంత ?
Read Also : Yashoda | డేట్‌ను రౌండప్ చేస్తూ.. యశోద సినిమా విడుదలపై సమంత టీం హింట్ ..!
Read Also :Anushka Shetty | కాంతార సినిమాను థియేటర్లలో మాత్రమే చూడండి : అనుష్క
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

