సినీ ఇండస్ట్రీలో ఏదో ఒక విభాగంలో పనిచేస్తూ..హీరోల వారసత్వాన్ని కొనసాగిస్తున్న కూతుళ్లున్నారని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. యాక్టింగ్‌లో కొందరుంటే నిర్మాణ రంగంలో మరికొందరు కొనసాగుతున్నారు. తాజాగా నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna)కు సంబంధించిన వార్త ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది. బాలకృష్ణ నటవారసుడిగా త్వరలోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఇవ్వబోతున్నాడని ఇప్పటికే ఎన్నో వార్తలు తెరపైకి వచ్చినా..అధికారికంగా మాత్రం ఎలాంటి అప్డేట్ రాలేదు.
కాగా ఇపుడు బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని (Tejaswini)వార్త ఒకటి టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. తేజస్విని సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు ఫిలింనగర్ సర్కిల్లో జోరుగా టాక్ నడుస్తోంది. ఇంతకీ ఏ కేటగిరిలో వర్క్ చేస్తుందనే కదా మీ డౌటు. తాజాగా వస్తున్న కథనాల ప్రకారం నిర్మాతగా మారనుందట తేజస్విని. ఇప్పటికే నాన్న బాలకృష్ణ హోస్ట్‌గా చేస్తున్న ఆహా షోకు పనిచేస్తున్నారు తేజస్విని.
సొంత బ్యానర్‌పై తేజస్విని సినిమాలు చేయాలని ప్లాన్ చేస్తున్నారని వస్తున్న వార్తలపై ప్రస్తుతానికి అధికారిక అప్డేట్ ఏం లేకున్నా..రానున్న రోజుల్లో దీనిపై ఏదైనా న్యూస్ బయటకు వస్తుందేమో చూడాలంటున్నారు సినీ జనాలు.
బాలకృష్ణ ప్రస్తుతం అన్‌స్టాపబుల్ సెకండ్ సీజన్‌తో బిజీగా ఉన్నారు. దీంతోపాటు గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎన్బీకే 107లో నటిస్తున్నాడు. ఈ సినిమా పూర్తవగానే అనిల్ రావిపూడితో కలిసి ఎన్బీకే 108 మొదలుపెట్టబోతున్నాడు.
Read Also : Rashmika Mandanna | ఇది నా ఫేవరేట్ ఫొటో.. రష్మిక మందన్నా ఏ బీచ్‌కు వెళ్లిందో తెలుసా..?
Read Also : Yashoda | డేట్‌ను రౌండప్ చేస్తూ.. యశోద సినిమా విడుదలపై సమంత టీం హింట్ ..!
Read Also :Anushka Shetty | కాంతార సినిమాను థియేటర్లలో మాత్రమే చూడండి : అనుష్క
Read also : Rajinikanth | జైలర్ షూటింగ్ స్పాట్లో రజినీకాంత్.. ఫొటోలు, వీడియో వైరల్