నేషనల్ క్రష్ రష్మిక మందన్నా(Rashmika Mandanna) సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ పెట్టిందంటే క్రేజ్ మామూలుగా ఉండదు. రష్మిక మాల్దీవులకు వెళ్లిన ఫొటోలు ఇప్పటికే నెట్టింట్లో ట్రెండింగ్ అవుతూ..టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తున్నాయి. రీసెంట్గా Travel+Leisure ట్రావెల్ మ్యాగజైన్ కోసం ఫొటోషూట్‌లో పాల్గొన్నది రష్మిక.
ఇటీవలే అనైటా ష్రాఫ్ డిజైనింగ్ బ్లాక్ బికినీ వేర్లో బీచ్‌లో హాట్ హాట్ ఫోజులిచ్చింది రష్మిక. ఇంతకీ ఈ భామ ఏ బీచ్‌కు వెళ్లిందనే కదా మీ డౌటు. ఫొటోషూట్ కోసం రష్మిక తన టీంతో కలిసి అబుదాబిలోని సెయింట్ రెజిస్ సాడియత్ ఐలాండ్ బీచ్‌కు వెళ్లింది. ఇప్పటికే ఫొటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. కాగా ఇదే నా ఫేవరేట్ ఫొటో అంటూ ఆ ఆల్బమ్‌లో నుంచి తాజాగా ఓ స్టిల్‌ను షేర్ చేసుకుంది.
బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్‌తో కలిసి నటించిన గుడ్ బై ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. దీంతోపాటు సిద్దార్థ్ మల్హోత్రాతో కలిసి నటిస్తున్న మిషన్ మజ్ను విడుదల కావాల్సి ఉంది. మరోవైపు బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్‌తో కలిసి యానిమల్ సినిమాలో నటిస్తోంది రష్మిక. ఈ ప్రాజెక్ట్ షూటింగ్ దశలో ఉంది. అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్లో పుష్పకు కొనసాగింపుగా వస్తున్న పుష్ప..ది రూల్ సినిమా కూడా రష్మిక ఖాతాలో ఉంది.
Read Also : Nandamuri Balakrishna | సినిమాల్లోకి బాలకృష్ణ చిన్నకూతురు..క్రేజీ టాక్‌లో నిజమెంత ?
Read Also : Yashoda | డేట్‌ను రౌండప్ చేస్తూ.. యశోద సినిమా విడుదలపై సమంత టీం హింట్ ..!
Read Also :Anushka Shetty | కాంతార సినిమాను థియేటర్లలో మాత్రమే చూడండి : అనుష్క