Sitaare Zameen Par Movie | ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఛైర్పర్సన్, ప్రముఖ రచయిత్రి, రాజ్యసభ సభ్యురాలు సుధా మూర్తి బాలీవుడ్ నటుడు ఆమీర్ ఖాన్ నటించిన ‘సితారే జమీన్ పర్'(Sitaare Zameen Par) సినిమాపై ప్రశంసలు కురిపించింది. ఈ చిత్రం తన ఆలోచనలను మార్చేసిందని, ఇది తప్పకుండా చూడాల్సిన సినిమా అని ఆమె చెప్పుకోచ్చింది.
బాలీవుడ్ మిస్టర్ ఫర్ఫెక్ట్ ఆమిర్‌ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘సితారే జమీన్ పర్’ (Sitaare Zameen Par). ‘సబ్ కా అప్న అప్న నార్మల్’ అనేది ఉపశీర్షిక. ఆర్ఎస్ ప్రసన్న దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో జెనీలియా కథానాయికగా నటిస్తున్నారు. ఆమిర్‌ఖాన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఆమిర్‌ఖాన్ మరియు అపర్ణ పురోహిత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా జూన్ 20న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖలతో పాటు రాజకీయ నాయకుల కోసం ప్రత్యేక ప్రీమియర్‌ను ప్రదర్శించారు మేకర్స్. ఈ ప్రీమియర్‌లో ప్రముఖ రచయిత్రి, రాజ్యసభ సభ్యురాలు సుధా మూర్తి కూడా పాల్గోంది. అయితే ఈ సినిమా చూసిన అనంతరం సుధా మూర్తి భావోద్వేగానికి లోనయ్యింది.
ఈ సినిమా చూసిన తర్వాత సుధా మూర్తి తన అనుభవాలను పంచుకుంటూ, “ఈ సినిమా చూశాక నా కళ్లలో నీళ్లు తిరిగాయి. ఇది కేవలం ఒక సినిమా కాదు, మన ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేసే ఒక అనుభవం. మానసిక వికలాంగులగా బాధపడుతున్న పిల్లలను మనం ఎలా అర్థం చేసుకోవాలి, వారికి ఎలా మద్దతు ఇవ్వాలి అనే దానిపై ఈ చిత్రం అద్భుతమైన సందేశాన్ని ఇస్తుంది” అని అన్నారు. ప్రతి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మరియు సమాజంలోని ప్రతి ఒక్కరూ ఈ సినిమాను చూడాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
When someone like @SmtSudhaMurty says it’s a must-watch… you know it’s special. See you in theatres on 20th June! 😉#SitaareZameenPar #SabkaApnaApnaNormal, 20th June Only In Theatres.@geneliad @r_s_prasanna @DivyNidhiSharma @aparna1502 @AroushDatta #GopiKrishnanVarma… pic.twitter.com/Sy8jIcbmm2
— Aamir Khan Productions (@AKPPL_Official) June 10, 2025
Read More