Timmajipeta | తిమ్మాజిపేట, జూన్ 10 : తిమ్మాజిపేట మండలంలోని ప్రభుత్వ పాఠశాలల పరిశుభ్రత పారిశుధ్యంపై మంగళవారం మండల స్థాయిలో ఒకరోజు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. స్థానిక కేజీబీవీ పాఠశాలలో జరిగిన శిక్షణ కార్యక్రమానికి తిమ్మాజీపేట ఎంఈఓ సత్యనారాయణ శెట్టి హాజరై మాట్లాడారు. పాఠశాలలను తెరిచేనాటికి పాఠశాలలను పరిశుభ్రంగా, ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాలన్నారు. తరగతి గదులతో పాటు మరుగుదొడ్లు, నీటి ట్యాంకులు, పరిసరాలు పరిశుభ్రంగా ఉండేటట్లు చూడాలన్నారు. పాఠశాల పరిసర ప్రాంతాల్లో మురుగునీరు పారకుండ ఉండాలని, ఎక్కడ కూడా చెత్తాచెదారము ఉండొద్దని, పారిశుధ్య కార్మికుల ద్వారా పరిశుభ్ర కార్యక్రమాలను చేపట్టాలన్నారు. ప్రధానోపాధ్యాయులు బాధ్యత తీసుకోని తీర్చిదిద్దాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రిసోర్స్ పర్సన్ కొల్లి జయపాల్ రెడ్డి, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు.