Stree 2 | బాలీవుడ్ యాక్టర్లు శ్రద్దా కపూర్ (Shraddha Kapoor), రాజ్ కుమార్ రావు కాంబోలో రిలీజైన హార్రర్ కామెడీ జోనర్ సీక్వెల్ ‘స్త్రీ 2’ (Stree 2). అమర్ కౌశిక్ దర్శకత్వం వహించాడు. ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైన స్త్రీ 2 తొలి రోజు నుంచి నేటి వరకు ఏదో ఒక వార్తతో నెట్టింట టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తోంది. థియేటర్లలో రికార్డు వసూళ్లు రాబట్టిన స్త్రీ 2 రూ.600 కోట్లకుపైగా వసూళ్లతో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తూనే ఉంది. థియేటర్లో సినిమాను మిస్సయిన వారి కోసం ఓటీటీ అప్డేట్ కూడా వచ్చేసింది.
స్త్రీ 2 ప్రస్తుతం పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫాం అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. అయితే ట్విస్ట్‌తో స్ట్రీమింగ్ అవుతోంది స్త్రీ 2. ప్రస్తుతానికి ఈ సినిమాను అమెజాన్‌లో చూడాలనుకుంటే.. రెంటల్ ఫీ విధానంలో రూ.349 చెల్లించాల్సి ఉంది. ఒకవేళ ఉచితంగా ఈ చిత్రాన్ని చూడాలనుకుంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ఈ చిత్రంలో పంకజ్ త్రిపాఠి, అభిషేక్ బెనర్జీ, అపరశక్తి ఖురానా ఇతర నటీనటులు కీలక పాత్రల్లో నటించారు.
స్త్రీ 2 ఓపెనింగ్ డేన ఫైటర్, కల్కి 2898 ఏడీ (హిందీ) వసూళ్లను అధిగమించడంతోపాటు ఈ ఏడాది హిందీ సినిమాలో బిగ్గెస్ట్ ఓపెనర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. మరోవైపు రెండో వారంలోనే రూ.400 కోట్ల క్లబ్‌లోకి ఎంటరై ఈ ఏడాది అత్యధిక గ్రాస్ సాధించిన సినిమాగా నిలిచి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది. ట్రేడ్ అనలిస్టుల ప్రకారం జవాన్ 57 రోజుల్లో పై ఫిగర్‌ను చేరుకుంటే.. స్త్రీ 2 మాత్రం కేవలం 34 రోజుల్లో టాప్ గ్రాసింగ్ ఫిల్మ్‌గా నిలిచిందని కూడా అప్డేట్ వచ్చింది. ఇక స్త్రీ 2 ఓటీటీలో రాబోయే రోజుల్లో ఎలాంటి ట్రెండ్ క్రియేట్ చేస్తుందో చూడాలంటున్నారు సినీ జనాలు.
Biggest Ever Hindi Blockbuster Horror Film #Stree2 Streaming Now On Amazon Prime Videos (Rent)🔥#RajkummarRao | #ShraddhaKapoor pic.twitter.com/ZkeBrl0WFe
— Saloon Kada Shanmugam (@saloon_kada) September 25, 2024
Hanu Man | బాహుబలి, ఆర్ఆర్ఆర్ రూట్లో తేజ సజ్జా హనుమాన్.. ప్రశాంత్ వర్మ కొత్త పోస్టర్ వైరల్
Prakash Raj | చేయని తప్పుకి సారీ.. హాట్ టాపిక్‌గా ప్రకాశ్ రాజ్ మరో ట్వీట్
Devara Movie | ‘దేవర’ టికెట్ ధరలు.. నిర్మాతలకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు భారీ షాక్.!