SSMB 29 | టాలీవుడ్ స్టార్ యాక్టర్ మహేశ్ బాబు (Maheshbabu), గ్లోబల్ స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) కాంబోలో ఎస్ఎస్ఎంబీ 29 (SSMB 29) వస్తోన్న విషయం తెలిసిందే. ఆఫ్రికన్ అడ్వెంచరస్ డ్రామా నేపథ్యంలో ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో గ్లోబ్ ట్రోటర్‌గా వస్తోన్న ఈ చిత్రంలో బాలీవుడ్ భామ ప్రియాంకా చోప్రా ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తుండగా.. మాలీవుడ్ స్టార్ యాక్టర్ పృథ్విరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.
ఈ మూవీ టైటిల్ లాంచ్ ఈవెంట్ నవంబర్ 15న రామోజీ ఫిలింసిటీలో గ్రాండ్‌గా జరుగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మేకర్స్ అండ్ టీం ఏర్పాట్లు చేసే పనిలో నిమగ్నమైంది. మహేశ్ బాబు, జక్కన్న అభిమానులు, మూవీ లవర్స్ భారీ సంఖ్యలో వచ్చే అవకాశముండటంతో విశాలమైన స్థలంలో స్టేజ్, స్క్రీన్ల ఏర్పాటు చేయడంతోపాటు వాహనాల పార్కింగ్ సహా ఇతర ఏర్పాట్లు చేస్తున్నారు.
ఎస్ఎస్ఎంబీ 29 టైటిల్ లాంచ్ ఈవెంట్ ప్లాట్‌ఫాంను 130 అడుగుల వెడల్పు, 100 అడుగుల ఎత్తులో ఉండే విధంగా నిర్మిస్తున్నారని వార్తలు కూడా వచ్చాయి. ఈవెంట్‌కు ఏర్పాటుకు సంబంధించిన కొన్ని ఫొటోలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. ఈ ఫొటోలపై మీరూ ఓ లుక్కేయండి మరి. ఈ చిత్రాన్ని దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కేఎల్ నారాయణ తెరకెక్కిస్తున్నారు. రెండు పార్టులుగా రాబోతున్న ఈ చిత్రాన్ని 2027, 2029లలో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వస్తుండగా జక్కన్న టీం నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.
#SSMB29 Event preparations are in full swing in RFC💥💥
Don’t miss the event Fans ki full eye feast, estimation 1 lakh+ crowd💥🦁
It will be the biggest ever event planned for any Indian film 💥#GlobeTrotter #MaheshBabu #SSRajamouli pic.twitter.com/Ql2u9ZYsFv
— TFI Movie Buzz (@TFIMovieBuzz) November 12, 2025
Event gonna be hugeeee 🔥🔥🔥
Passes will be out from Tommorow.
No special passes for fans!! 👍🏻
Andariki same passes untayi!! 😙#GlobeTrotter #SSMB29 pic.twitter.com/khb4WWp55E
— 🔱 I J A Y (@prince_baabu) November 12, 2025
Ram Gopal Varma | చాలా కాలం తర్వాత నిజమైన రాంచరణ్‌ను చూశా.. చికిరి చికిరి సాంగ్‌పై రాంగోపాల్ వర్మ