ఎన్టీఆర్, రామ్‌చరణ్ కథానాయకులుగా నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. చారిత్రక కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో తొలితరం స్వాతంత్య్రసమరయోధులు అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్, కొమురంభీమ్‌గా ఎన్టీఆర్ నటిస్తున్నారు. లాక్డౌన్ కారణంగా వాయిదాపడిన ఈ సినిమా చిత్రీకరణ సోమవారం పునఃప్రారంభమైంది. రామ్‌చరణ్ తిరిగి సెట్స్‌లో అడుగుపెట్టారు. ప్రముఖ హెయిర్ైస్టెలిస్ట్ అలీమ్ హకీమ్.. రామ్‌చరణ్‌తో కలిసి దిగిన ఓ ఫొటోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ‘రామ్‌చరణ్ హెయిర్‌కట్‌తో ఈ రోజును మొదలుపెట్టాను. అందరికీ ఇష్టమైన దర్శకుడు రాజమౌళి రూపొందిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ షూట్‌కి చెర్రీ సిద్ధమయ్యారు’ అని ట్వీట్ చేశాడు. సోమవారం నుంచి ప్రారంభమైన తాజా షెడ్యూల్లో రామ్‌చరణ్, ఎన్టీఆర్‌లపై కీలక సన్నివేశాలను దర్శకుడు రాజమౌళి చిత్రీకరించబోతున్నట్లు తెలిసింది. మంగళవారం నుంచి ఎన్టీఆర్ షూటింగ్లో పాల్గొననున్నట్లు సమాచారం. అలియాభట్, ఒలివియామోరీస్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు.