ఆర్ఆర్ఆర్ (RRR) సినిమాతో గ్లోబల్ బాక్సాఫీస్ ను మరోసారి షేక్ చేశాడు ఎస్ఎస్ రాజమౌళి. బాక్సాఫీస్ వద్ద కలెక్షన సునామి సృష్టించిన ఆర్ఆర్ఆర్ ఇపుడు జపాన్‌లో కూడా సందడి చేసేందుకు రెడీ అయింది. ఈ ఎపిక్ డ్రామా ప్రాజెక్ట్ జపాన్‌లో అక్టోబర్ 21న (శుక్రవారం) గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో జక్కన్న అండ్ హీరోల టీం ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది.
రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్ కలిసి జపాన్ స్థానిక మీడియాతో చిట్ చాట్ చేశారు. ఆర్ఆర్ఆర్ సినిమా విశేషాలని మీడియాతో పంచుకున్నారు. జక్కన్న టీం ఫొటోలు ఇపుడు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతున్నాయి. ఇప్పటికే తారక్ (Jr NTR) , రాంచరణ్ (Ram Charan) జపాన్ సందర్శనకు సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
ఆర్ఆర్ఆర్లో అలియాభట్, అజయ్ దేవ్గన్, శ్రియాశరణ్, ఒలివియా మొర్రీస్, సముద్రఖని కీలక పాత్రలు పోషించారు. డీవీవీ ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఆర్ఆర్ఆర్ వరల్డ్ వైడ్‌గా రూ.1100 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టి రికార్డులు సృష్టించింది. పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ లో రాంచరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించగా.. ఎన్టీఆర్ కొమ్రంభీం పాత్రలో నటించాడు.
3人は日本のメディアにインタビューを受けています!#あーるあーるあーる #RRRinJapan #RRRMovie pic.twitter.com/vr0oXigBTM
— RRR Movie (@RRRMovie) October 20, 2022
#MegaPowerStar @alwaysRamCharan can be seen looking sharp and dapper in beige jacket and trousers for the promotions of #RRR in Japan, which is soon releasing for the Japanese audience. #RamCharan pic.twitter.com/TlJgPP822O
— BA Raju's Team (@baraju_SuperHit) October 20, 2022