నెల్లిబండలో పట్టపగలే వీధి లైట్ల వెలుగులు
నకిరేకల్ మండలం నెల్లిబండ గ్రామంలోని వీధిలైట్లు పట్టపగలే వెలుగుతున్నా సంబంధిత పంచాయతీ అధికారి గానీ, గ్రామ పంచాయతీ కార్యాలయ సిబ్బంది కానీ పట్టించుకోవడం లేదు.
– పట్టించుకోని విద్యుత్, మండల పరిషత్ అధికారులు
నకిరేకల్, ఫిబ్రవరి 11 : నకిరేకల్ మండలం నెల్లిబండ గ్రామంలోని వీధిలైట్లు పట్టపగలే వెలుగుతున్నా సంబంధిత పంచాయతీ అధికారి గానీ, గ్రామ పంచాయతీ కార్యాలయ సిబ్బంది కానీ పట్టించుకోవడం లేదు. తెల్లవారుజామున 6 గంటలకే వీధిలైట్లను బంద్ చేయాల్సి ఉన్నా ఇలా వదిలేయడం పంచాయతీ సిబ్బంది నిర్లక్ష్యానికి అద్ధం పడుతోంది. గత కొన్ని నెలలుగా ఇదే తంతు నడుస్తుందని ఇటు అధికారులు గానీ, అటు పంచాయతీ సిబ్బంది గానీ ఎవరూ పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. నెలలు తరబడి కరెంట్ వృథా అవుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. విద్యుత్ ఏఈ గానీ, ఎంపీఓ గానీ, ఎంపీడీఓ గానీ స్పందించి విద్యుత్ వృథాను అరికట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

