సర్కార్ కొలువుకు రాజీనామా.. ఉన్నతాధికారులు అవమానించారంటూ ఆవేదన
ప్రైవేట్ సంస్థలకు అనుకూలంగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారనే కారణంతో సస్పెండ్ అయి, ఇటీవలే తిరిగి విధుల్లో చేరిన ఓ ఉపాధ్యాయురాలు శనివారం రాజీనామా చేశారు. సస్పెండ్ అయ్యాక ఉన్నతాధికారుల వద్ద తాను అనేక అవమానాలు ఎదుర్కొన్నానని ఓ వీడియో రికార్డు చేసి ఆదివారం సోషల్‌మీడియాలో పోస్టు చేయగా వైరల్ అయింది.
- సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న టీచర్ వీడియో
ఖమ్మం అర్బన్, ఆగస్టు 3 : ప్రైవేట్ సంస్థలకు అనుకూలంగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారనే కారణంతో సస్పెండ్ అయి, ఇటీవలే తిరిగి విధుల్లో చేరిన ఓ ఉపాధ్యాయురాలు శనివారం రాజీనామా చేశారు. సస్పెండ్ అయ్యాక ఉన్నతాధికారుల వద్ద తాను అనేక అవమానాలు ఎదుర్కొన్నానని ఓ వీడియో రికార్డు చేసి ఆదివారం సోషల్‌మీడియాలో పోస్టు చేయగా వైరల్ అయింది. ఖమ్మం జిల్లా కేంద్రంలోని మామిళ్లగూడెం ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయురాలు బీ గౌతమి.. ప్రైవేట్ సంస్థలకు అనుకూలంగా సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ ప్రచారం చేస్తున్నారన్నారంటూ జనవరి 21న డీఈవో సస్పెండ్ చేశారు.
తన తప్పును క్షమించి, సస్పెన్షన్‌ను రద్దుచేయాలని విన్నవించుకునేందుకు అప్పటి డీఈవో వద్దకు వెళితే.. ‘నా దగ్గరకు రాకు.. వెళ్లిపో..’ అంటూ చీదరించుకున్నారని కంటతడి పెట్టారు. విచారణ అనంతరం సదరు ఉపాధ్యాయురాలికి ఈ ఏడాది జూలై 17న ఖమ్మం ఖాజీపుర ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యాశాఖ అధికారులు పోస్టింగ్ ఇవ్వగా విధుల్లో చేరారు. శనివారం ఖమ్మం డీఈవో కార్యాలయానికి వెళ్లి తన రాజీనామా లేఖను డీఈవో, డీఈవో ఏడీకి అందజేశారు. కాగా సస్పెన్షన్ సమయంలో ఉన్నతాధికారులను కలిసి వివరణ ఇచ్చేందుకు వెళ్లినప్పుడు వారు తనపట్ల అవమానకరంగా ప్రవర్తించారంటూ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Engilipula Batukamma | సందడిగా.. సంప్రదాయబద్ధంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు..!
ఈఎంసిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
Bathukamma | జపాన్‌లో బతుకమ్మ సంబురాలు.. టోక్యోలో వెల్లివిరిసిన తెలంగాణ సంస్కృతి
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

