ఎమోషన్స్ తో కూడిన లైఫ్ యాక్షన్ డ్రామాలను సిల్వర్ స్క్రీన్‌పై చూపించడంలో ఎస్ఎస్ రాజమౌళిది (SS Rajamouli) ప్రత్యేకమైన శైలి. కామెడీ, యాక్షన్ సినిమాలను ప్రేక్షకులకు అందించిన ఈ స్టార్ డైరెక్టర్ టచ్ చేయని జోనర్ ఏదైనా ఉందంటే..అది హార్రర్. అందుకు కారణం తాను అభిమానించే సినిమాల జాబితాలో హార్రర్ చిత్రాలు ఎక్కువగా లేకపోవడమే. ఆహా వెబ్ సిరీస్ Anya’s Tutorial ట్రైలర్ లాంఛ్ ఈవెంట్లో రాజమౌళి చెప్పిన మాటలే దీనికి నిదర్శనం.
హార్రర్ సినిమాలను తాను నిజంగా అంతగా ఆరాధించనని చెప్పాడు జక్కన్న. ఇప్పటివరకు కేవలం రెండు హార్రర్ సినిమాలంటే తనకిష్టమన్నాడు. వీటిలో ఒకటి The Omen కాగా రెండోది The Paranormal Activity. ఇక ఈ రెండు సినిమాలంటే ఇష్టపడే ప్రేక్షకులు ప్రపంచవ్యాప్తంగా చాలా మందే ఉన్నారు. రాజమౌళి అభిమానులు, ఫాలోవర్లలో ఈ రెండు సినిమాలు చూడని వారెవరైనా ఉంటే..ఈ హార్రర్ సినిమాలను తమ వాచ్‌లిస్టులో యాడ్ చేసుకుంటారనేది మాత్రం పక్కా. ప్రస్తుతం ఈ స్టార్ డైరెక్టర్ మహేశ్ బాబుతో చేయబోయే సినిమా స్క్రిప్ట్ వర్క్ పనుల్లో ఉన్నట్టు టాలీవుడ్ సర్కిల్ టాక్.
పల్లవి గంగిరెడ్డి డైరెక్ట్ చేసిన ఈ వెబ్ సిరీస్‌లో రెజినీ కసాండ్రా, నివేదితా సతీశ్ లీడ్ రోల్స్ లో నటించారు. జులై 1న ప్రీమియర్ కానుంది ఈ ప్రాజెక్టు. శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని వెబ్ సిరీస్‌ను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పల్లవి గంగిరెడ్డి స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు.
Read Also : Sai Pallavi | ఎలాంటి అబ్బాయి అంటే ఇష్టమో చెప్పిన సాయిపల్లవి
Read Also : Genelia D’Souza | జెనీలియా గ్రాండ్ రీఎంట్రీ..క్రేజీ సినిమా వివరాలివే..!
Read Also : Vishwak Sen | యాక్షన్ కింగ్ డైరెక్షన్లో విశ్వక్సేన్..కాంబో అదిరింది
Read Also : Jr NTR | అవార్డు విన్నింగ్ డైరెక్టర్‌తో ఎన్టీఆర్..క్రేజీ న్యూస్‌లో నిజమెంత..!