ఆర్ఆర్ఆర్ సక్సెస్ ను ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు రాజమౌళి (SS Rajamouli). ఈ సినిమాతో తెలుగు సినిమాల ఖ్యాతిని మరోసారి ఖండాతరాల్లో చాటి చెప్పాడు ఈ స్టార్ డైరెక్టర్. భారీ కలెక్షన్లను రాబడుతూ సక్సెస్ఫుల్ గా దూసుకెళ్తుండటంతో..మధురమైన విజయాన్ని తనివి తీరా ఆస్వాదిస్తున్నాడు. సెలబ్రేషన్స్ లో భాగంగా రాజమౌళి ఓ కారు కొనుక్కున్నాడు. ఇంతకీ జక్కన్న తీసుకున్న కారు ఖరీదెంతో తెలుసా..? ఫిలింనగర్ సర్కిల్ అప్ డేట్ ప్రకారం రూ.45లక్షలు.
ఇటీవలే రెండ్ కలర్ వోల్వో ఎక్స్ సీ 40 (Red Volvo XC40 car ) కారు కొనుగోలు చేశాడు. సదరు కార్ల కంపెనీ రాజమౌళి ఇంటికి కొత్త కారును పంపించింది. కంపెనీ ప్రతినిధి చేతుల మీదుగా కారు తాళాలు అందుకుంటున్న స్టిల్ ఇపుడునెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. ఇక జక్కన్న మరోవైపు సూపర్ స్టార్ మహేశ్ బాబు సినిమా కోసం స్క్రిప్ట్ సిద్దం చేసే పనిలో ఉన్నట్టు టాక్.
ప్రీ ప్రొడక్షన్ పనులను కూడా పర్యవేక్షిస్తున్నాడట జక్కన్న. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలపై త్వరలోనే స్పష్టత రానుంది. దక్షిణాఫ్రికా అడవుల నేపథ్యంలో అడ్వంచెరస్ సినిమాగా రాబోతుందని ఇన్ సైడ్ టాక్ వినిపిస్తోండగా..దీనిపై రానున్న రోజుల్లో క్లారిటీ రానుంది.