SSMB 29 | గ్లోబల్ స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli)- మహేశ్ బాబు (Maheshbabu) కలయికలో రాబోతున్న మోస్ట్ అవెయిటెడ్ ప్రాజెక్ట్ ఎస్ఎస్ఎంబీ 29 (SSMB 29). గ్లోబ్ ట్రోటర్‌గా ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో ఆఫ్రికన్ అడ్వెంచరస్ డ్రామా నేపథ్యంలో వస్తోన్న ఈ మూవీలో బాలీవుడ్ భామ ప్రియాంకా చోప్రా ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. మాలీవుడ్ స్టార్ యాక్టర్ పృథ్విరాజ్ సుకుమారన్ మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు.
ఇప్పటికే రిలీజ్ చేసిన పృథ్విరాజ్ సుకుమారన్ పోస్టర్ వైరల్ అవుతోంది. జక్కన్న టీం ప్రస్తుతం క్లైమాక్స్ షూట్లో బిజీగా ఉన్నట్టు సమాచారం. కాగా ఎస్ఎస్ఎంబీ 29 టీం రామోజీఫిలింసిటీలో టైటిల్ లాంచ్ ఈవెంట్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
తాజా టాక్ ప్రకారం ఈవెంట్‌ను ఇదివరకెన్నడూ లేని విధంగా ప్లాన్ చేస్తోంది రాజమౌళి టీం. ఎస్ఎస్ఎంబీ 29 టైటిల్ లాంచ్ ఈవెంట్ ప్లాట్‌ఫాంను 130 అడుగుల వెడల్పు, 100 అడుగుల ఎత్తులో ఉండే విధంగా నిర్మిస్తున్నారట. ఇప్పటిదాకా ఏ సినిమా ఈవెంట్‌కు లేని విధంగా జక్కన్న తొలిసారి ఈ స్థాయిలో గ్రాండ్ ప్లాన్ చేస్తూ అభిమానులు, మూవీ లవర్స్‌కు ముందే చెప్పినట్టుగా విజువల్ ట్రీట్ ఇవ్వబోతున్నాడని అర్థమవుతోంది.
హైదరాబాద్ శివారులోని రామోజీ ఫిలింసిటీలో నవంబర్ 15న సాయంత్రం 6 గంటల నుంచి గ్రాండ్ ఈవెంట్ షురూ కానుంది. ఈవెంట్ నేపథ్యంలో హైదరాబాద్‌లో ల్యాండ్ కూడా అయింది ప్రియాంకా చోప్రా. ఈ చిత్రాన్ని దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కేఎల్ నారాయణ తెరకెక్కిస్తున్నారు. రెండు పార్టులుగా రాబోతున్న ఈ చిత్రాన్ని 2027, 2029లలో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వస్తుండగా జక్కన్న టీం నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.
K Ramp Movie | ఓటీటీలోకి కిరణ్ అబ్బవరం ‘కే ర్యాంప్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే.!
Rajinikanth | 50 ఏళ్ల సినీ కెరీర్.. రజనీకాంత్‌ను సన్మానించనున్న ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్
Ajay Bhupathi | ‘మంగళవారం’ దర్శకుడి కొత్త ప్రాజెక్ట్.. అనౌన్స్మెంట్ రేపే.!