SS Rajamouli | ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ బాక్సాఫీస్‌ను షేక్ చేశాడు మాస్టర్ స్టోరీ టెల్లర్ ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli). ఈ స్టార్ డైరెక్టర్ ప్రస్తుతం మహేశ్ బాబుతో ఎస్ఎస్ఎంబీ 29 చేస్తున్నాడని తెలిసిందే. గ్లోబల్ అడ్వెంచరస్ ప్రాజెక్టుగా రాబోతున్న ఈ చిత్రం అత్యంత ఖరీదైన సినిమాగా హిస్టరీలో నిలిచిపోయేలా ఉండబోతున్నట్టు ఫిలింనగర్ సర్కిల్ టాక్.
కాగా జక్కన్న మరో స్టార్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar)తో కలిసి దిగిన స్టిల్ ఒకటి ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తోంది. ఇంతకీ వీళ్లిద్దరు ఎక్కడ ప్రత్యక్షమయ్యారనే కదా మీ డౌటు. పుష్ప ది రూల్ సెట్స్‌కు వెళ్లాడు ఎస్ఎస్ రాజమౌళి. ఈ విషయాన్ని పుష్ప 2 సినిమాటోగ్రాఫర్ మిరోస్లా బ్రోజెక్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ ఫొటోను ఎవరు తీశారో ఊహించండి..? పుష్ప 2 సెట్స్‌ను సందర్శించిన రాజమౌళికి ధన్యవాదాలు. బెస్ట్ మూడ్‌లో సుకుమార్ సార్.. అంటూ క్యాప్షన్ ఇచ్చాడు మిరోస్లా బ్రోజెక్.
ఈ ఫొటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. కాగా మరి బ్రోజెక్ అడిగినట్టుగా.. ఇంతకీ ఆ ఫొటో తీసిందెవరనేది మాత్రం ఇంట్రెస్టింగ్గా మారింది.
Amaran | ఇందు రెబెకా వర్గీస్‌గా సాయిపల్లవి.. శివకార్తికేయన్ అమరన్ ఇంట్రో వీడియో వైరల్
Devara Review | దేవర మూవీ రివ్యూ: ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ కొట్టాడా? లేదా ?
Prakash Raj | గెలిచే ముందొకటి.. గెలిచిన తర్వాత ఇంకోటి.. పవన్ కల్యాణ్‌పై ప్రకాశ్‌రాజ్ ఫైర్