ఆర్ఆర్ఆర్ (RRR)నుంచి నాటు నాటు సాంగ్ (Naatu Naatu Song) బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో అత్యంత ప్రతిషాత్మక ఆస్కార్ పురస్కారం అందుకున్న విషయం తెలిసిందే. అయితే ఆస్కార్ అవార్డు కోసం ఎస్ఎస్ రాజమౌళి టీం కోట్లు ఖర్చు చేస్తుందని కొందరంటుంటే.. అవార్డు కొన్నారని మరికొందరు నెట్టింట కామెంట్స్ చేశారు. అయితే ఈ కామెంట్స్ పై జక్కన్న కుమారుడు ఆర్ఆర్ఆర్ లైన్ ప్రొడ్యూసర్ ఎస్ఎస్ కార్తికేయ (SS Karthikeya) ఓ నేషనల్ ఛానల్ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు.
ఆర్ఆర్ఆర్ పలు భాషల్లో ఘన విజయం సాధించిన తర్వాత ఇంగ్లీష్ (యూఎస్)లో జూన్ 1న విడుదల చేయాలనుకున్నాం. థియేటర్ల వివరాలు సేకరించి ఒక్క రోజు కోసం కేవలం 60 థియేటర్లలో స్క్రీనింగ్ చేద్దామనుకున్నాం. అయితే అప్పటికి ఐదు రోజుల ముందే నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ మొదలైంది. ఒక రోజు అనుకుని సినిమా విడుదల చేస్తే.. అలా నెల రోజులు గడిచిపోయింది. నాన్-ఇండియన్స్ సినిమాను బాగా ఆదరించారని చెప్పుకొచ్చాడు.
ప్రేక్షకులకు చాలా బాగా నచ్చింది..
ఆర్ఆర్ఆర్కు ఇండియా నుంచి అధికారికంగా ఆస్కార్ ఎంట్రీ లభించనప్పుడు కొంత బాధ అనిపించింది. అధికారికంగా సినిమాను పంపించి ఉంటే బలంగా ఉండేది. ఆస్కార్ కోసం క్యాంపెయిన్ చేసినప్పుడు చాలా ఖర్చు పెట్టారని, ఆస్కార్ టీంను కొనేశారని, ఆస్కార్ టికెట్ల కోసం ఎక్కువ ఖర్చు పెట్టారని వార్తలు వచ్చాయి. ఆర్ఆర్ఆర్ ప్రొఫైల్ పెంచేందుకు భారీగా డబ్బులు ఖర్చు పెట్టామన్న ప్రచారం ఎందుకు వచ్చిందో తెలియదు. ప్రేక్షకులకు సినిమా చాలా బాగా నచ్చింది. ఆస్కార్ కోసం ఖచ్చితంగా క్యాంపెయిన్ చేయాలనుకున్నాం. బడ్జెట్‌కు లోబడే.. ఎక్కడ ఎంత ఖర్చు పెట్టాలనేది ప్లాన్ ప్రకారమే జరుగుతుంది. డబ్బులు ఇచ్చి ఆస్కార్ కొనుకోవచ్చన్నది పెద్ద జోక్..అన్నాడు కార్తికేయ.
ఆస్కార్స్ 95 ఏండ్ల చరిత్ర కలిగిన ఇనిస్టిట్యూషన్. అక్కడ ఏదైనా ఒక ప్రాసెస్ ప్రకారం ఉంటుంది. ప్రేక్షకుల ప్రేమను కొనగలమా..? ఆర్ఆర్ఆర్ గురించి స్టీవెన్ బర్గ్, జేమ్స్ కామెరూన్ మాటలను కొనలేం కదా. అభిమానులే సినిమాకు చాలా బాగా క్యాంపెయిన్ చేశారు. ఆస్కార్ క్యాంపెయిన్ కోసం హాలీవుడ్ వాళ్లు అయితే పలు స్టూడియోలకు వెళ్తారు. మాకు అలాంటి అవకాశం లేదు.
మొత్తం ఖర్చు రూ.8.5 కోట్లు..
ఆస్కార్ క్యాంపెయిన్ కోసం మేము అనుకున్న బడ్జెట్ రూ. 5కోట్లు. ఈ బడ్జెట్‌ను కూడా మూడు దశల్లో ఖర్చు పెట్టాలనుకున్నాం. తొలి దశలో రూ.2.5 కోట్ల నుంచి రూ.రూ.3 కోట్ల వరకు ఖర్చు పెట్టాం. నామినేషన్స్ వచ్చిన తర్వాత బడ్జెట్ మరింత పెంచాం. అయితే ఆస్కార్ క్యాంపెయిన్‌కు ఐదారు కోట్లతుందనుకున్నాం. కానీ చివరకు రూ.8.5 కోట్లు ఖర్చు పెట్టాం. క్యాంపెయిన్‌లో భాగంగా లాస్ ఏంజెల్స్ లో మరిన్ని స్క్రీనింగ్స్ చేయాల్సి వచ్చిందని చెప్పుకొచ్చాడు..
Shaakuntalam | సమంత శాకుంతలం 3డీ ట్రైలర్ లాంఛ్ టైం ఫిక్స్
MM Keeravani | నా మొదటి ఆస్కార్ రాంగోపాల్ వర్మ.. కీరవాణి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Orange | ఆరెంజ్ రీరిలీజ్.. అప్పుడు డిజాస్టర్ టాక్.. ఇప్పుడు ఆల్‌టైమ్ రికార్డు