Orange | ఆరెంజ్ రీరిలీజ్.. అప్పుడు డిజాస్టర్ టాక్.. ఇప్పుడు ఆల్‌టైమ్ రికార్డు
Orange |రాంచరణ్ (Ram Charan) కెరీర్లో ఫ్లాప్ టాక్ మూటగట్టుకున్న సినిమా ఆరెంజ్ (Orange). రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రానికి హరీష్ జైరాజ్ సంగీతం అందించాడు. బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ తెచ్చుకున్నా.. మ్యూజికల్‌గా మాత్రం మంచి టాక్ తెచ్చుకుంది ఆరెంజ్.
Orange | టాలీవుడ్ స్టార్ హీరో రాంచరణ్ (Ram Charan) కెరీర్లో ఫ్లాప్ టాక్ మూటగట్టుకున్న సినిమా ఏదైనా ఉందా అంటే.. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఆరెంజ్ (Orange) అని చెప్పేస్తారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రంలో జెనీలియా హీరోయిన్గా నటించింది. అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ చిత్రం నాగబాబుకు తీవ్ర నష్టాలను తెచ్చిపెట్టింది. ఈ చిత్రానికి హరీష్ జైరాజ్ సంగీతం అందించాడు. అయితే బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ తెచ్చుకున్నా.. మ్యూజికల్‌గా మాత్రం మంచి టాక్ తెచ్చుకుంది ఆరెంజ్.
అయితే ఏ సినిమా సాధించని అరుదైన రికార్డు ఖాతాలో వేసుకుంది ఆరెంజ్. అదేంటనుకుంటున్నారా..? ఆరెంజ్ చిత్రాన్ని శనివారం తెలుగు రాష్ట్రాల్లో రీరిలీజ్ (Orange re release) చేశారు. భారీ ఫ్లాప్‌గా నిలిచిన ఈ చిత్రానికి ఎవరూ ఊహించని విధంగా స్పందన వస్తోంది. ఏపీ, తెలంగాణలో మొదటి రోజు చాలా వరకు షోలు ప్రేక్షకులతో నిండిపోయాయి. హైదరాబాద్‌లో అయితే ఏ సినిమా సాధించని రికార్డు ఆరెంజ్ ఖాతాలో నమోదైంది.
ఆర్టీఎక్స్ రోడ్స్ థియేటర్లలో వేసిన 12 స్పెషల్ షోల్లో అన్నీ హౌస్‌ఫుల్‌తో స్క్రీనింగ్ అయింది ఆరెంజ్. ఓ ఫ్లాప్ సినిమా రీరిలీజ్ చేసిన తర్వాత ఇలాంటి ఆల్‌టైమ్ రికార్డు సాధించడం అంత సులభమైన విషయం ఏమీ కాదు. రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ఆర్సీ 15 చిత్రంలో నటిస్తున్నాడు. పొలిటికల్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో
బాలీవుడ్ భామ కియారా అద్వానీ, రాజోలు భామ అంజలి ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. శ్రీకాంత్, సముద్రఖని, నవీన్ చంద్ర, జయరాయ్, సునీల్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఆర్సీ 15 చిత్రానికి కార్తీక్ సుబ్బరాజు కథనందిస్తుండగా.. సాయిమాధవ్ బుర్రా డైలాగ్స్ అందిస్తున్నారు.
Global star @AlwaysRamCharan ⭐ sets #OrangeSpecialShows #OrangeReRelease 💥💥💥💥 on fire 🔥🔥🔥🔥🔥
The bookings 👌👌👌👌 pic.twitter.com/788Nww4uFN
— SKN (Sreenivasa Kumar) (@SKNonline) March 26, 2023
Read Also :
Shaakuntalam | సమంత శాకుంతలం 3డీ ట్రైలర్ లాంఛ్ టైం ఫిక్స్
MM Keeravani | నా మొదటి ఆస్కార్ రాంగోపాల్ వర్మ.. కీరవాణి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

