MM Keeravani | నా మొదటి ఆస్కార్ రాంగోపాల్ వర్మ.. కీరవాణి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
MM Keeravani | సినిమా ఇండస్ట్రీలో ఒక్క ఛాన్స్ అందుకుని కెరీర్లో లెజెండరీ స్థాయికి ఎదిగినవాళ్లు చాలా మందే ఉన్నారు. అందులో ఒకరు ఎంఎం కీరవాణి (MM Keeravani). ఆర్ఆర్ఆర్లో నాటు నాటు సాంగ్‌కు రీసెంట్గా ఎంఎం కీరవాణి ప్రతిష్టాత్మక పురస్కారం అందుకున్న విషయం తెలిసిందే.
MM Keeravani | సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపించే పదం ఒక్క ఛాన్స్. ఇండస్ట్రీలో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు కొత్త డైరెక్టర్లు, యాక్టర్లు ఒకే ఒక్క ఛాన్స్ వస్తే చాలు అంటూ ఎదురుచూస్తుంటారని తెలిసిందే. ఆ ఒక్క ఛాన్సే వాళ్ల కెరీర్‌ను ముందుకు తీసుకెళ్లే తొలి అడుగుగా పడుతుంది. అలా ఒక్క ఛాన్స్ అందుకుని కెరీర్లో లెజెండరీ స్థాయికి ఎదిగినవాళ్లు చాలా మందే ఉన్నారు. అందులో ఒకరు ఎంఎం కీరవాణి (MM Keeravani). రీసెంట్గా ఎంఎం కీరవాణి ఆర్ఆర్ఆర్లో నాటు నాటు సాంగ్‌కు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో అత్యంత ప్రతిష్టాత్మక ఆస్కార్ పురస్కారం అందుకున్న విషయం తెలిసిందే. అయితే ఇది తనకు రెండో ఆస్కార్ అని, మొదటిది ఆస్కార్ వేరే ఉందని చెప్పుకొచ్చాడు.
ఇదే విషయంపై ఓ చిట్‌చాట్‌లో కీరవాణి మాట్లాడుతూ..’దాదాపు 51 మంది దర్శకులు, నిర్మాతలు, ఇతరులు నా డెమో క్యాసెట్‌ను తిరస్కరించారు. సగం మంది నా పనితీరు ఏంటో కూడా వినకుండా చెత్తబుట్టలో పడేసి ఉండొచ్చు. కానీ నా డెబ్యూ క్యాసెట్ విన్న రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma)నాకు క్షణ క్షణం (Kshana Kshanam) సినిమాకు పనిచేసే అవకాశం ఇచ్చి.. మొదటి బ్రేక్ అందించారు. నేను టాలెంటెడ్ కంపోజర్నా..? కాదా..? అని తెలియదు. కానీ రాంగోపాల్ వర్మ నన్ను ఎంపిక చేసిన తర్వాత చాలా మంది నేను టాలెంటెడ్ అని భావించి నాతో సినిమాలకు సంతకం చేయించుకున్నారు. అందుకే వర్మే నా మొదటి ఆస్కార్ అంటూ చెప్పుకొచ్చాడు’ కీరవాణి.
మొత్తానికి కెరీర్లో తొలినాళ్లలోనే మంచి బ్రేక్ ఇచ్చిన వర్మను గుర్తు చేసుకుని.. ఎవరు అవునన్నా.. కాదన్నా వర్మ టాలెంటెడ్ డైరెక్టర్ అని మరోసారి చెప్పకనే చెప్పాడు కీరవాణి. ప్రస్తుతం ఈ లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ హరిహరవీరమల్లు సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Running Clubs | నగరాల్లో రన్నింగ్ క్లబ్‌లకు పెరుగుతున్న ప్రాధాన్యత.. అసలేంటివి.. ఎలాంటి లాభాలను అందిస్తాయి..?
Karnataka HC | ప్రతి విషయాన్ని విచారించే అధికారం ఆ సంస్థకు లేదు.. కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు..!
girl consumes cough syrup dies | జ్యూస్‌గా భావించి దగ్గు మందు అంతా తాగిన బాలిక.. నిద్రలోకి జారుకుని మృతి
Yogita Rana | విద్యతో ఖైదీల్లో మార్పునకు చర్యలు : విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారాణా
VC Aldas Janaiah | వీసీ అల్డాస్ జానయ్యపై చర్యలకు ప్రొఫెసర్లు, విద్యార్థుల డిమాండ్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

