Srikanth Iyengar | టాలీవుడ్లో ఉన్న టాలెంటెడ్ యాక్టర్లలో ఒకరు శ్రీకాంత్ అయ్యంగార్ (Srikanth Iyengar). భిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను అలరించే ఈ నటుడు పొట్టేల్ సక్సెస్ మీట్లో రివ్యూ రైటర్ల గురించి మాట్లాడుతూ.. జీవితంలో షార్ట్ ఫిలిం కూడా తీయని నా కొడుకులు రివ్యూ రాస్తారా.. సినిమా తీయడం ఎంత కష్టమో రఫ్ ఐడియా కూడా లేదు.. అంటూ కామెంట్స్ చేశాడని తెలిసిందే.
ఈ నేపథ్యంలో సినీ విమర్శకులపై చేసిన కామెంట్స్ నేపథ్యంలో ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ మా ప్రెసిడెంట్ మంచు విష్ణుకు ఫిర్యాదు చేసింది. శ్రీకాంత్ అయ్యంగార్పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నది. ఈ నేపథ్యంలో రివ్యూ రైటర్లపై చేసిన కామెంట్స్ నెట్టింట దుమారం రేపడంతో తాజాగా ఓ వీడియోను షేర్ చేశాడు శ్రీకాంత్ అయ్యంగార్.
పొట్టేల్ సినిమా సక్సెస్ మీట్లో కొన్ని మాటలు మాట్లాడా.. కొన్ని విషయాల్లో బాధ కలిగించాను. త్వరలో కరెక్ట్ విషయాల మీద మీ అందరికీ త్వరలోనే భేషరతుగా క్షమాపణలు చెప్పబోతున్నా. దయచేసి వేచి ఉండండి..అంటూ వీడియో సందేశాన్ని షేర్ చేశాడు. ఇప్పుడీ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
కొన్ని విషయాల్లో భాధ కలిగించా..
త్వరలో బేషరతు క్షమాపణలు చెప్పబోతున్నా
– #Srikanthayyangar pic.twitter.com/1Lu9VOWNDC— Ramesh Pammy (@rameshpammy) October 27, 2024
Actor #SrikanthIyengar Controversial comments on Review writers at #Pottel Success meet pic.twitter.com/0K3VFTguUC
— Ramesh Pammy (@rameshpammy) October 26, 2024
Matka | వరుణ్ తేజ్ మట్కాలో పుష్ప యాక్టర్.. ట్రెండింగ్లో లుక్
Lucky Baskhar | ప్రతీ అభిమాని కాలర్ ఎగరేస్తారు.. దుల్కర్ సల్మాన్ లక్కీభాస్కర్పై వెంకీ అట్లూరి