Sree Vishnu | కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు చేసే యాక్టర్లలో టాప్‌లో ఉంటాడు శ్రీ విష్ణు (Sree Vishnu). ఈ టాలెంటెడ్ హీరో నటిస్తోన్న తాజా చిత్రం స్వాగ్ (SWAG). హసిత్ గోలి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో పెళ్లి చూపులు ఫేం రీతూ వర్మ, దక్షా నగార్కర్ ఫీ మేల్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. స్వాగ్ అక్టోబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో శ్రీవిష్ణు టీం ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. తాజాగా మరో ప్రమోషనల్ వీడియోను షేర్ చేశారు మేకర్స్.
మన నాన్నగారి పేరు అందరికి తెలుసు.. మన తాతగారి ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. మరి వాళ్ల నాన్న పేరు.. వాళ్ల నాన్న పేరు.. వాళ్ల వాళ్ల నాన్న గారి పేరు.. మన వంశానికి మూల పురుషుడి పేరు.. తెలియదా.. తెలుసుకోండి.. తెలుసుకోవడానికి ప్రయత్నించండి. తెలుసుకొని మాకు పోస్ట్ చేయండి.. ఎందుకంటే మా సినిమా తరాల గురించి.. తరతరాల గురించి.. స్వాగణిక వంశంలో జరిగిన కథ గురించి.. అంటూ శ్రీవిష్ణు చిట్‌చాట్‌తో విడుదల చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతూ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది.
చారిత్రక నేపథ్యం ఉన్న శ్వాగణిక వంశం కథ బ్యాక్‌డ్రాప్‌లో రాబోతున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తుండగా.. వివేక్ కూచిబొట్ల సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి వివేక్ సాగర్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. స్వాగ్ నుంచి ఇప్పటికే రిలీజ్ చేసిన బాబా సెహెగల్ సింగరో సింగ సాంగ్ నెట్టింట వైరల్ అవుతూ సినిమాపై సూపర్ బజ్ క్రియేట్ చేస్తోంది.
స్వాగ్ ప్రమోషన్స్..
మీ వంశ మూల పురుషుడు ఎవరు?
Uncover your ancestry and post it using #SwagFamilyTree & Win exciting Prizes.🕺🏻#SWAGFromOct4th pic.twitter.com/sf0hYAoYNj
— BA Raju’s Team (@baraju_SuperHit) October 2, 2024
Mammootty | షూటింగ్ టైం.. లొకేషన్లో జైలర్ విలన్‌తో మమ్ముట్టి
Anushka Shetty | అనుష్క వెడ్డింగ్‌కు వేళాయె.. క్రేజీ వార్తలో నిజమెంత..?
Pooja hegde | విజయ్‌తో రొమాన్స్ వన్స్‌మోర్.. దళపతి 69 హీరోయిన్ ఫైనల్..!
NTR Neel | ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమా కథ ఇదే.. హీరోయిన్ కూడా ఫైనల్.. !