Swag | కథను నమ్మి సినిమాలు చేసే యాక్టర్లలో టాప్‌లో ఉంటాడు శ్రీ విష్ణు (Sree Vishnu). హిట్టు, ఫ్లాపులతో సంబంధం లేకుండా వినోదాన్ని అందించే ప్రయత్నం చేస్తుండే ఈ టాలెంటెడ్ యాక్టర్ కాంపౌండ్ నుంచి వస్తోన్న తాజా ప్రాజెక్ట్ స్వాగ్ (SWAG). హసిత్ గోలి దర్శకత్వం వహిస్తున్నాడు. పెళ్లి చూపులు ఫేం రీతూ వర్మ హీరోయిన్గా నటిస్తుంది. దక్షా నగార్కర్ మరో కీ రోల్ చేస్తోంది.
ఈ చిత్రం అక్టోబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది స్వాగ్ టీం. శ్రీవిష్ణు టీం ఇప్పటికే ప్రమోషనల్ ఇంటర్వ్యూలో పాల్గొంటుంది. మరో తొమ్మిది రోజుల్లో అంటూ కొత్త లుక్ షేర్ చేసింది. శ్రీవిష్ణు ఇందులో సాల్ట్ పెప్పర్ లుక్‌లో స్టైలిష్ బ్లాక్ గాగుల్స్ పెట్టుకొని సిగరెట్ తాగుతూ.. దివాకర్ పేట ఎస్ఐ భవభూతిగా వినోదాన్ని అందించబోతున్నట్టు చెప్పకనే చెబుతున్నారు మేకర్స్. సిల్వర్ స్క్రీన్‌పై నవ్వులు పూవులు పూయించడం పక్కా అని అర్థమవుతోంది.
స్వాగ్‌లో వింజామర వంశపు రాణి రుక్మిణి దేవిగా రీతూవర్మ మెరవనుంది. ఇప్పటికే రాజసం ఉట్టిపడే రాయల్ లుక్ వైరల్ అవుతోంది. చారిత్రక నేపథ్యం ఉన్న శ్వాగణిక వంశం కథకు కామెడీ టచ్‌ను జోడిస్తూ తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. వివేక్ కూచిబొట్ల సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు. వివేక్ సాగర్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.
In 𝟗 𝐃𝐀𝐘𝐒… To Go @sreevishnuoffl is all set to rock the screens as దివాకర్ పేట SI భవభూతి 🤘🏻#SWAGFromOct4th pic.twitter.com/chAyOr78up
— BA Raju’s Team (@baraju_SuperHit) September 25, 2024
Prakash Raj | చేయని తప్పుకి సారీ.. హాట్ టాపిక్‌గా ప్రకాశ్ రాజ్ మరో ట్వీట్
Devara Movie | ‘దేవర’ టికెట్ ధరలు.. నిర్మాతలకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు భారీ షాక్.!
Mohan Babu | మోహన్ బాబు ఇంట్లో చోరీ.. రూ.10 లక్షలతో ఉడాయించిన పనిమనిషి