టాలీవుడ్ (Tollywood) లో సినీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న చిత్రాల్లో ఒకటి లవ్ స్టోరీ (Lovestory). శేఖర్ కమ్ముల (Sekhar Kammula) దర్శకత్వంలో రూరల్ బ్యాక్ డ్రాప్ లో సాగే ప్రేమకథ నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 10న ప్రేక్షకుల ముందుకొస్తుందని ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. నాగచైతన్య, సాయిపల్లవి (Sai Pallavi) హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక బోల్డ్ లెటర్స్ తో రాసిన రిలీజ్ అప్ డేట్ పోస్టర్ లో చేసిన తప్పు ఒకటి మేకర్స్ ను వెంటాడుతుందట.
ఇంతకీ మేకర్స్ ను ఇబ్బంది పెడుతున్న ఆ తప్పేంటో తెలుసా..? పోస్టర్ ను తీక్షణంగా గమనిస్తే వినాయక చవితి (Vinayaka Chavithi) పదాన్ని తప్పుగా రాశారు. పోస్టర్ లో Vinakaya అని రాశారు. అయితే ఇది గమనించిన వెంటనే స్పెల్లింగ్ చెకింగ్ పోస్టర్ ను విడుదల చేశారు. కానీ అప్పటికే చాలా మంది మూవీ లవర్స్ పోస్టర్ తో పాటు రాసిన తప్పును కూడా చూసి..వినాయకుడి పేరును తప్పుగా రాసి లవ్ స్టోరీ చిత్ర బృందంపై నెగెటివ్ ఇంప్రెషన్ పడేలా చేశారు అంటూ కామెంట్లు పెట్టారు. ఇలా అనుకోకుండా జరిగిన తప్పు వల్ల సినిమాపై ఎఫెక్ట్ పడకుండా విడుదల విషయంపై ఏమైనా జాప్యం చేస్తారా..? అంటూ కొందరు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు.
ఇక సెంటిమెంట్లను తూచతప్పకుండా ఫాలో అవ్వడంలో సినీ పరిశ్రమ ముందుంటుంది. మరి లవ్ స్టోరీ మేకర్స్ తప్పు మూలాన సినిమాను ఏమైనా ఆలస్యం చేస్తారా..? లఏ లేదా అనుకున్న సమయానికి విడుదల చేస్తారా..? అంటూ తెగ చర్చించుకుంటున్నారు సినీ జనాలు. ఏది ఏమైనా అనుకోకుండా జరిగిన తప్పును చాలా మంది అర్థం చేసుకుంటారని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.
ఇవికూడా చదవండి..
Bangarraju : బంగార్రాజు ఫస్ట్ లుక్ విడుదల చేసిన నాగ చైతన్య
Bigg Boss: పుకార్లకి ఈ పోస్టర్‌తో చెక్ పడ్డట్టేనా ?
Chiranjeevi| చిరంజీవిని కలిసేందుకు 12 రోజులు సైకిల్ యాత్ర