న్యూఢిల్లీ, ఆగస్టు 19: లలితా జ్యూవెల్లరీ ఐపీవోకి అపూర్వ స్పందన లభించింది. సంస్థ జారీ చేసిన షేర్ల కంటే 62.97 రెట్ల బిడ్డింగ్ దాఖలయ్యాయి. బుధవారం చివరి రోజు కావడంతో 6,27,61,403 షేర్ల విక్రయానికి 3,95,22,17,604 బిడ్డింగ్లు దాఖలయ్యాయని తెలిపింది.
దీంట్లో క్యూఐబీ బిడ్డింగ్లు 145 రెట్లు దాఖలు కాగా, నాన్-ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల కోసం 73.90 రెట్లు బిడ్డింగ్ దాఖలుకాగా, రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి 11.81 రెట్లు సబ్స్ర్కైబర్ అయ్యాయి. షేరు ధరల శ్రేణిని రూ.190-201 మధ్యలో నిర్ణయించింది. ఈ ఐపీవో ద్వారా రూ.1,200 కోట్ల నిధులను సేకరించాలని నిర్ణయించిన సంస్థ..ఆఫర్ ఫర్ సేల్ రూట్లో మరో రూ.500 కోట్లు సమీకరించాలని నిర్ణయించింది.