e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, January 17, 2022
Home News 2020 ఎస్పీ బాలసుబ్రమణ్యం.. 2021 సిరివెన్నెల.. తెలుగు సినిమాకు గ్రహణం..

2020 ఎస్పీ బాలసుబ్రమణ్యం.. 2021 సిరివెన్నెల.. తెలుగు సినిమాకు గ్రహణం..

sp balasubrahmanyam and sirivennela seetharama sastry | ఎస్పీ బాలసుబ్రమణ్యం |  సిరివెన్నెల సీతారామశాస్త్రి
sp balasubrahmanyam and sirivennela seetharama sastry

sp balasubrahmanyam and sirivennela seetharama sastry తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎన్నో దశాబ్దాలుగా సేవ చేస్తున్న వాళ్లు.. వరస సంవత్సరాలలో లోకం నుంచి వెళ్లిపోయారు. కలలో కూడా ఊహించని విధంగా అందరినీ ఒంటరి చేసి శాశ్వతంగా గ‌గ‌న‌సీమ‌కు ఎగిశారు.. ఒకరు సాహిత్య పూదోటకు రారాజు అయితే.. మరొకరు సంగీత స్వర సామ్రాజ్యానికి మకుటంలేని చక్రవర్తి. తన గాత్రంతో 50 వేలకు పైగా పాటలు పాడి స్వర రాగ గంగా ప్రవాహంలో మునిగి తేలిన లెజెండరీ గాయకుడు. వాళ్లు ఎవరో ప్రత్యేకంగా మనం గుర్తు చేయాల్సిన అవసరం లేదు. తెలుగు సినిమా సాహిత్యం పేరు చెబితే ముందుగా గుర్తుకు వచ్చేది సిరివెన్నెల సీతారామశాస్త్రి.. అలాగే పాట అనే పదం మన ముందు ఉంటే ఎస్పీ బాలసుబ్రమణ్యం అనే అర్థం వినిపిస్తోంది. పాటకు మరో అర్థంలా నిలిచిపోయిన అద్భుతమైన గాత్రం బాలు సొంతం.

అలాంటి ఇద్దరు లెజెండరీ పర్సన్స్ కేవలం ఏడాది వ్యవధిలోనే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోవడం అత్యంత విచారకరం. అది కూడా అప్పటి వరకు ఆరోగ్యంగా ఉండి.. ఉన్నఫలంగా అనారోగ్యానికి గురై శాశ్వత నిద్రలోకి వెళ్లిపోయారు బాలు, సిరివెన్నెల సీతారామశాస్త్రి. 2020 సెప్టెంబర్ 25న ఎస్పీ బాలసుబ్రమణ్యం కరోనా కారణంగా కన్నుమూశారు. దానికి ముందు 2 నెలల పాటు చెన్నైలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు బాలసుబ్రమణ్యం. ఇక ఇప్పుడు సిరివెన్నెల సీతారామశాస్త్రి నవంబర్ 24న హైదరాబాద్ కిమ్స్ హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యారు. ఆయనకు లంగ్ క్యాన్సర్ తో పాటు న్యుమోనియా కూడా రావడంతో శరీరంలోని పలు అవయవాలు స్పందించలేదు. దాంతో పరిస్థితి అదుపుతప్పి నవంబర్ 30 సాయంత్రం 4.07 నిమిషాలకు ఆయన తుది శ్వాస విడిచారు. దాదాపు మూడున్నర దశాబ్దాల పాటు తెలుగు సినీ వినీలాకాశంలో తన పాటల సిరివెన్నెల పూయించిన సీతారామశాస్త్రి ఇక లేడని ఎప్పటికీ రాడని తెలుసుకున్న అభిమానులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఏదేమైనా ఒక సంవత్సరం గ్యాప్ లోనే ఇద్దరు లెజెండ్స్ ను తెలుగు సినిమా కోల్పోవాల్సి రావడం అత్యంత దురదృష్టకరం.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చదవండి..

sirivennela | సిరివెన్నెల నటించిన ఒకే ఒక్క సినిమా ఏంటో తెలుసా..?

సిరివెన్నెల సీతారామశాస్త్రి జీవితంలో కీలకమైన ఘట్టాలు ఇవే..

సిరివెన్నెల సీతారామశాస్త్రికి అవార్డులు తీసుకొచ్చిన పాటలు ఇవే..

‘సిరివెన్నెల దురదృష్టం..తెలుగు వారి అదృష్టం..’ త్రివిక్ర‌మ్ స్పీచ్ వీడియో ట్రెండింగ్

సిరివెన్నెల‌, త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ మ‌ధ్య ఉన్న బంధుత్వం ఏంటో తెలుసా?

sirivennela songs | అలాంటి పాట‌ల‌ను రాయ‌లేను : సిరివెన్నెల‌

Sirivennela | సిరివెన్నెల‌కు ఆ పేరెలా వ‌చ్చిందో తెలుసా?

నా పాట‌ల్లో ఎప్పుడూ నేను క‌నిపించొద్దు.. సిరివెన్నెల కోరిక ఎప్పుడూ అదే

sirivennela | సిరివెన్నెల మృతిపై కిమ్స్‌ ఆస్పత్రి వైద్యులు ఏమన్నారంటే..

అష్టైశ్వర్యాలకంటే ఎక్కువగా వ్యక్తిత్వానికే విలువిస్తాను: సిరివెన్నెల

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement