‘సిరివెన్నెల దురదృష్టం..తెలుగు వారి అదృష్టం..’ త్రివిక్రమ్ స్పీచ్ వీడియో ట్రెండింగ్
Trivikram Speech on Sirivennela | ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి (Sirivennela Sitaramasastri) గురించి ఒక్కమాటలో చెప్పిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా..? అంటే ఠక్కున గుర్తొచ్చేపేరు త్రివిక్రమ్ శ్రీనివాస్

‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి (Sirivennela Sitaramasastri) గురించి ఒక్కమాటలో చెప్పిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా..? అంటే ఠక్కున గుర్తొచ్చేపేరు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas). సిరివెన్నెల గురించి త్రివిక్రమ్ మాట్లాడిన మాటలు ఇపుడు వైరల్ అవుతున్నాయి. 2012లో జరిగిన మా మ్యూజిక్ అవార్డ్స్ ఫంక్షన్లో త్రివిక్రమ్ మాట్లాడుతూ..సిరివెన్నెల తెలుగు సినీ కవి కావడం ఆయన దురదృష్టం..అది తెలుగు వారి అదృష్టమంటూ త్రివిక్రమ్ ప్రసంగంలో సిరివెన్నెల గురించి గూస్ బంప్స్ తెప్పించేలా చెప్పుకొచ్చాడు.
‘సీతారామశాస్త్రిగారి గురించి చెప్పడానికి నాకున్న శక్తి సరిపోదు. నాకున్న పదాలుసరిపోవు. ఎందుకంటే సిరివెన్నెల సినిమాలో ఆయన రాసిన ‘ప్రాగ్ధిశ వేణియపైన, దినకరమయూఖ తంత్రులపైన’ పాట విన్న తర్వాత తెలుగు డిక్షనరీ ఒకటి ఉంటుందని, దాన్ని ‘శబ్ద రత్నాకరం’ అంటారని తెలుసుకున్నా. ఆ డిక్షనరీ కొనుక్కొని ప్రాగ్ధిశ అంటే ఏంటీ..? మయూఖం అంటే ఏంటి? అని తెలుసుకున్నా. ఒక పాటను అర్థమయ్యేలా రాయాల్సిన అవసరం లేదు..అర్థం చేసుకోవాలన్న కోరిక పుట్టేలా కూడా రాయొచ్చని నిరూపించిన వ్యక్తి సిరివెన్నెల’ అని త్రివిక్రమ్ అన్నారు.
‘తెలుగు పాట స్థాయిని పెంచిన వ్యక్తి సిరివెన్నెల. ఆయన అర్థరాత్రి ఉదయించే సూర్యుడు..పదాలు అనే కిరణాలు తీసుకొని, అక్షరాలు అనే తూటాలు తీసుకుని ప్రపంచం మీద వేటాడటానికి బయలుదేరుతాడు’ అంటూ సిరివెన్నెల గురించి త్రివిక్రమ్ భావోద్వేగంగా మాట్లాడిన త్రోబ్యాక్ వీడియో ఇపుడు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
shiva shankar master | వెన్నెముక గాయం.. ఎనిమిదేళ్లు మంచంపైనే.. అయినా 800 సినిమాలకు కొరియోగ్రఫీ
shiva shankar | శివ శంకర్ మాస్టర్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా..?
Sirivennela | తొలి పాటకే ప్రేక్షకుల గుండెల్లో చోటు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Uttam Kumar Reddy | బ్యారేజెస్ రిహాబిలిటేషన్ చెబుతున్నట్టు నీళ్లు ఎత్తిపోయలేం : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
Fire Accident | నోయిడాలో భారీ అగ్నిప్రమాదం.. ఒకరు మృతి.. పలు దుకాణాలు అగ్నికి ఆహుతి..!
Men Check Into Hotel With Girls | ఇద్దరు బాలికలతో కలిసి హోటల్లో బస చేసిన ఇద్దరు వ్యక్తులు.. తర్వాత ఏం జరిగిందంటే?
MLA Sudheer Reddy | బటన్ ఒత్తితే నీళ్లొస్తయని చెప్పినం.. హైదరాబాద్‌కు ఏడాదికి 10 టీఎంసీల నీళ్లు సరిపోతయి : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
Kriti Sanon | మన బట్టలు, మన ఇష్టం.. కామెంట్ చేసే హక్కు వాళ్లకు ఎవరిచ్చారు?: కృతి సనన్ ఫైర్!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

