సిరివెన్నెల, త్రివిక్రమ్ శ్రీనివాస్ మధ్య ఉన్న బంధుత్వం ఏంటో తెలుసా?

relation between sirivennela and trivikram srinivas | తెలుగు పాటకు పట్టం కట్టి.. సినీ సాహిత్యానికి గౌరవం పెంచిన లెజండరీ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అకాల మరణం అందర్నీ కలిచివేస్తుంది. ఆయన మరణం పట్ల కేవలం సినీ ఇండస్ట్రీనే కాదు.. ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ సహా చాలామంది సంతాపం వ్యక్తం చేస్తున్నారు. సిరివెన్నెల వ్యక్తిత్వం గురించి గొప్పగా చెప్పుకుంటూ ఆయన్ను తలచుకుంటున్నారు. ఈ క్రమంలోనే సిరివెన్నెల సీతారామశాస్త్రిపై గతంలో ప్రముఖ డైరెక్టర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. ఆయన అర్ధరాత్రి ఉదయించే సూర్యుడు అంటూ సిరివెన్నెల గురించి త్రివిక్రమ్ స్పీచ్‌ను ఆన్లైన్లో సెర్చ్ చేసి మారి వింటున్నారు. ఈ నేపథ్యంలోనే త్రివిక్రమ్, సిరివెన్నెల మధ్య ఉన్న రిలేషన్ గురించి ఆరా తీస్తున్నారు.
స్వయంవరం సినిమాతో త్రివిక్రమ్ శ్రీనివాస్ రైటర్‌గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత నువ్వేకావాలి సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించాడు. అప్పటివరకు మూసధోరణితో వెళ్తున్న సినిమాలకు కొత్త స్టైల్‌ను అలవాటు చేశాడు. సులువైన పదాలతో పంచ్ డైలాగులు రాసి జనాలకు దగ్గరయ్యాడు. మాటల మాంత్రికుడిగా పేరు తెచ్చుకున్నాడు. త్రివిక్రమ్ వర్కింగ్ స్టైల్‌తో పాటు.. ఆయన వ్యక్తిత్వం నచ్చడంతో ఆయనకు సిరివెన్నెల బాగా దగ్గరయ్యాడు. ఈ క్రమంలోనే తన ఇంట్లో పెళ్లిచూపులు అరెంజ్ చేశాడు సిరివెన్నెల. కానీ అక్కడ పెళ్లికూతురికి బదులు ఆమె చెల్లిని త్రివిక్రమ్ ఇష్టపడ్డాడు. ఇదే విషయాన్ని సిరివెన్నెలకు చెప్పాడు త్రివిక్రమ్. ముందుగా సంశయించిన సిరివెన్నెల.. సరే అని త్రివిక్రమ్ ఇష్టపడిన అమ్మాయితోనే పెళ్లి జరిపించాడు. ఆ అమ్మాయి ఎవరో కాదు.. స్వయానా సిరివెన్నెల సోదరుడి కుమార్తె సౌజన్య. అంటే సిరివెన్నెల సీతారామశాస్త్రికి త్రివిక్రమ్ శ్రీనివాస్ అల్లుడు అవుతాడు అన్నమాట. ఆ వివాహం తర్వాత సిరివెన్నెల, త్రివిక్రమ్ మధ్య బంధం ఇంకా బలపడింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
సిరివెన్నెల సీతారామశాస్త్రి జీవితంలో కీలకమైన ఘట్టాలు ఇవే..
సిరివెన్నెల సీతారామశాస్త్రికి అవార్డులు తీసుకొచ్చిన పాటలు ఇవే..
‘సిరివెన్నెల దురదృష్టం..తెలుగు వారి అదృష్టం..’ త్రివిక్రమ్ స్పీచ్ వీడియో ట్రెండింగ్
sirivennela songs | అలాంటి పాటలను రాయలేను : సిరివెన్నెల
Sirivennela | సిరివెన్నెలకు ఆ పేరెలా వచ్చిందో తెలుసా?
నా పాటల్లో ఎప్పుడూ నేను కనిపించొద్దు.. సిరివెన్నెల కోరిక ఎప్పుడూ అదే
sirivennela | సిరివెన్నెల మృతిపై కిమ్స్ ఆస్పత్రి వైద్యులు ఏమన్నారంటే..
అష్టైశ్వర్యాలకంటే ఎక్కువగా వ్యక్తిత్వానికే విలువిస్తాను: సిరివెన్నెల
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Uttam Kumar Reddy | బ్యారేజెస్ రిహాబిలిటేషన్ చెబుతున్నట్టు నీళ్లు ఎత్తిపోయలేం : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
Fire Accident | నోయిడాలో భారీ అగ్నిప్రమాదం.. ఒకరు మృతి.. పలు దుకాణాలు అగ్నికి ఆహుతి..!
Men Check Into Hotel With Girls | ఇద్దరు బాలికలతో కలిసి హోటల్లో బస చేసిన ఇద్దరు వ్యక్తులు.. తర్వాత ఏం జరిగిందంటే?
MLA Sudheer Reddy | బటన్ ఒత్తితే నీళ్లొస్తయని చెప్పినం.. హైదరాబాద్‌కు ఏడాదికి 10 టీఎంసీల నీళ్లు సరిపోతయి : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
Kriti Sanon | మన బట్టలు, మన ఇష్టం.. కామెంట్ చేసే హక్కు వాళ్లకు ఎవరిచ్చారు?: కృతి సనన్ ఫైర్!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

