నా పాటల్లో ఎప్పుడూ నేను కనిపించొద్దు.. సిరివెన్నెల కోరిక ఎప్పుడూ అదే

Sirivennela Seetharama Sastry | వేటూరి తర్వాత తెలుగు పాటకు ప్రాణం పోశారు సీతారామశాస్త్రి. విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం.. అంటూ మొదలైన ఆయన పాటల ప్రయాణంలో ఎన్నో ఆణిముత్యాలను అందించారు. కళాతపస్వి కె.విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన సిరివెన్నెల సినిమాలో ఆయన రాసిన పాటలతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చోటును దక్కించుకున్నాడు. ఆ సినిమా పేరునే ఇంటి పేరుగా మార్చుకున్నారు. చంబోలు సీతారామశాస్త్రి కాస్త సిరివెన్నెల సీతారామశాస్త్రిగా మారారు. అప్పటి నుంచి ఆయన పాటల ప్రవాహం ఒక యజ్ఞంలా కొనసాగింది. మూడు దశాబ్దాల సినీ కెరీర్లో ఎన్నో అద్భుతమైన పాటలను అందించారు. అయితే ఎన్ని అణిముత్యాల్లాంటి పాటలను రాసినప్పటికీ.. ఆ పాటల్లో ఎప్పుడూ తాను కనబడకూడదని కోరుకునేవారు సిరివెన్నెల సీతారామశాస్త్రి. గతంలో నమస్తే తెలంగాణకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇదే విషయాన్ని ప్రస్తావించారు.
సినిమా జీవితానికి ప్రతిబింబం. రెండింటికీ తేడా ఏమిటంటే సినిమాలో కొంత నాటకీయత దాగి ఉంటుంది. ఎక్కడైతే మాట మూగబోతుందో అక్కడే పాట మొదలవుతుంది. నా పాటల్లో నేను కనిపించొద్దని ఎప్పుడూ కోరుకుంటుంటాను. ఆ పాటను ఆస్వాదించే వారి భావాలే కనిపించాలన్నది నా ఆకాంక్ష. సమాజం, ప్రజలు అనే సామూహిక భావనల పట్ల నాకు కొన్ని నిశ్చిత అభిప్రాయాలున్నాయి. అవి మనలోని చాలామందిలో ఉన్నాయని భావిస్తాను. అని ఆ ఇంటర్వ్యూలో సిరివెన్నెల సీతారామశాస్త్రి చెప్పారు. అంతేకాకుండా సింధూరం సినిమా సమయంలోని ఒక సందర్భాన్ని గురించి చెబుతూ.. ‘అర్థశతాబ్దపు అజ్ఞానాన్ని..’ పాటలో కొన్ని పంక్తులను సినిమాలో వినిపించలేదు. ‘సురాజ్యమవలేని సురాజ్యమెందుకని..సుఖాన మనలేని వికాస మెందుకని. సుమాల బలికోరే సమాజమెందుకని. అడుగుతోంది అదిగో ఎగిరే భరతపతాకం. తెలుసుకోండి ఆ తల్లి తపనలో నేటి కన్నీటి కథనం. విషాదవర్షంలో వివర్ణ చిత్రమని..త్రిశంకు స్వర్గంలో త్రివర్ణ స్వప్నమని తెలుపుతోంది అదిగో ఎగిరే భరతపతాకం. ఆకసానికి తనను ఎగరేసి ఏకాకిగా తననొదిలేసి పాతాళంలో నిలిచిన పౌరుల కరతాళ ధ్వని చూసి విలవిలలాడుతూ వెలవెలబోయెను మువ్వన్నెల జెండా.జలజల కురిసెను తెగిపడిపోయిన ఆశల పువ్వుల దండ’…ఈ లైన్స్ సినిమాలో వినిపించవు. వాటిలో ఎంతో ఆర్తి దాగివుందని నా నమ్మకం. భారతసోదరులు నిజంగా సంతోషంగా ఉన్నారా? స్వాతంత్య్ర ఫలాలు నిజంగా నెరవేరాయా? అనే ఆవేదనతో రాసిన పాట ఇది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Sirivennela Sitaramasastri | సిరివెన్నెల సీతారామశాస్త్రి కన్నుమూత
సిరివెన్నెల సీతారామశాస్త్రి జీవితంలో కీలకమైన ఘట్టాలు ఇవే..
shiva shankar master | వెన్నెముక గాయం.. ఎనిమిదేళ్లు మంచంపైనే.. అయినా 800 సినిమాలకు కొరియోగ్రఫీ
shiva shankar | శివ శంకర్ మాస్టర్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Uttam Kumar Reddy | బ్యారేజెస్ రిహాబిలిటేషన్ చెబుతున్నట్టు నీళ్లు ఎత్తిపోయలేం : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
Fire Accident | నోయిడాలో భారీ అగ్నిప్రమాదం.. ఒకరు మృతి.. పలు దుకాణాలు అగ్నికి ఆహుతి..!
Men Check Into Hotel With Girls | ఇద్దరు బాలికలతో కలిసి హోటల్లో బస చేసిన ఇద్దరు వ్యక్తులు.. తర్వాత ఏం జరిగిందంటే?
MLA Sudheer Reddy | బటన్ ఒత్తితే నీళ్లొస్తయని చెప్పినం.. హైదరాబాద్‌కు ఏడాదికి 10 టీఎంసీల నీళ్లు సరిపోతయి : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
Kriti Sanon | మన బట్టలు, మన ఇష్టం.. కామెంట్ చేసే హక్కు వాళ్లకు ఎవరిచ్చారు?: కృతి సనన్ ఫైర్!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

