సిరివెన్నెల సీతారామశాస్త్రి జీవితంలో కీలకమైన ఘట్టాలు ఇవే..

Sirivennela Seetharama Sastry | తెలుగు ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణం కేవలం సంగీత ప్రియులకు మాత్రమే కాదు.. కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులకు.. తెలుగు భాషకు కూడా తీరని లోటు. ఎన్నో వేల పాటలు ఆయన కలం నుంచి జాలువారాయి. ఆరుద్ర, ఆత్రేయ తరం తర్వాత వేటూరి, సిరివెన్నెల కొన్ని సంవత్సరాల పాటు తెలుగు సినిమా మకుటం లేని మహారాజుల్లా ఏలారు. వేటూరి మరణం తర్వాత తెలుగు సినిమా గేయ రచయితలో పెద్దదిక్కుగా మారిపోయారు సిరివెన్నెల సీతారామశాస్త్రి. నాటి సిరివెన్నెల సినిమాలోని విధాత తలపుల పాట నుంచి నేటి సామజవరగమన కొరకు ఎన్నో అద్భుతమైన పాటలను రాశారు ఆయన.
20 మే, 1955న ఆంధ్ర ప్రదేశ్ లోని అనకాపల్లి మండలంలో జన్మించారు. 1984లో బాలకృష్ణ హీరోగా వచ్చిన జననీ జన్మభూమి సినిమాతో కెరీర్ ప్రారంభం అయింది. అందులో చంబోలు సీతారామశాస్త్రిగా ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. కానీ సీతారామశాస్త్రికి గుర్తింపు తీసుకొచ్చిన సినిమా మాత్రం సిరివెన్నెల. కె.విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాతో ఆయన మోస్ట్ వాంటెడ్ రైటర్ అయిపోయారు. అదే సినిమా ఇంటిపేరుగా మారిపోయింది. సిరివెన్నెల సినిమాతో అవార్డులు సొంతం చేసుకున్నారు సీతారామశాస్త్రి. దర్శకుడు కె.విశ్వనాథ్‌తో అన్ని సినిమాలకు పనిచేసిన అనుభవం సిరివెన్నెల సొంతం. కె.విశ్వనాథ్ ఆయనను ప్రేమగా సీతారాముడు అని పిలుస్తాడు. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆయనకు బంధువు అనే విషయం చాలామందికి తెలుసు. అందుకే తన ప్రతి సినిమాలో సిరివెన్నెలతో పాట రాయించుకున్నాడు త్రివిక్రమ్.
ఆయన గురించి ఎంతో గొప్పగా మాట్లాడేవాడు మాటల మాంత్రికుడు. రామ్ గోపాల్ వర్మ, కృష్ణవంశీ, త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి దర్శకులందరూ సిరివెన్నెల పాట లేకపోతే సినిమా చేయరు. ఈయనను 2019లో పద్మశ్రీతో సత్కరించారు. కెరీర్లో ఉత్తమ గేయ రచయితగా 11 నంది అవార్డులు.. నాలుగు ఫిలింఫేర్ సొంతం చేసుకున్నాడు సిరివెన్నెల. ఈ మధ్య వెంకటేశ్ నారప్ప, కొండపొలం సినిమాలో పాటలు రాశారు. ట్రిపుల్ ఆర్ సినిమాలో దోస్తీ పాట రాసింది సిరివెన్నెల సీతారామశాస్త్రి కావడం గమనార్హం. తెలుగు ఇండస్ట్రీలో హీరోలందరితో కలిసి సిరివెన్నెల పనిచేశారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Sirivennela Sitaramasastri | సిరివెన్నెల సీతారామశాస్త్రి కన్నుమూత
Sirivennela | తొలి పాటకే ప్రేక్షకుల గుండెల్లో చోటు
shiva shankar master | వెన్నెముక గాయం.. ఎనిమిదేళ్లు మంచంపైనే.. అయినా 800 సినిమాలకు కొరియోగ్రఫీ
shiva shankar | శివ శంకర్ మాస్టర్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Uttam Kumar Reddy | బ్యారేజెస్ రిహాబిలిటేషన్ చెబుతున్నట్టు నీళ్లు ఎత్తిపోయలేం : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
Fire Accident | నోయిడాలో భారీ అగ్నిప్రమాదం.. ఒకరు మృతి.. పలు దుకాణాలు అగ్నికి ఆహుతి..!
Men Check Into Hotel With Girls | ఇద్దరు బాలికలతో కలిసి హోటల్లో బస చేసిన ఇద్దరు వ్యక్తులు.. తర్వాత ఏం జరిగిందంటే?
MLA Sudheer Reddy | బటన్ ఒత్తితే నీళ్లొస్తయని చెప్పినం.. హైదరాబాద్‌కు ఏడాదికి 10 టీఎంసీల నీళ్లు సరిపోతయి : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
Kriti Sanon | మన బట్టలు, మన ఇష్టం.. కామెంట్ చేసే హక్కు వాళ్లకు ఎవరిచ్చారు?: కృతి సనన్ ఫైర్!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

