sirivennela songs | అలాంటి పాటలను రాయలేను : సిరివెన్నెల

sirivennela songs | విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం అంటూ మొదలైన తన ప్రయాణంలో ఎన్నో ఆణిముత్యాలను అందించారు సిరివెన్నెల సీతారామశాస్త్రి. ఆది భిక్షువు వాడినేమి కోరేదీ, బూడిదిచ్చే వాడినేమి అడిగేదీ.. అంటూ భక్తిభావం కలిగించాడు. అర్ధశతాబ్దపు అజ్ఞాన్ని స్వతంత్రం అందామా అంటూ.. అగ్నిజ్వాలలను రగలించే పాటలను రాశారు. తెల్లారింది లెగండొయ్ అంటూ స్ఫూర్తిని నింపారు. సామజవరగమనా.. నిను చూసి ఆగ గలనా అంటూ ప్రేమగీతాలను రాశారు. కేవలం ఒక్క జోనర్‌కు అని పరిమితం కాకుండా సరసం, శృంగారం, వేదన, ఆలోచన.. ఇలా కవిత్వంలో ఎన్ని విభాగాలు ఉంటే అన్నింటిలోనూ పాటలను రాసి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్నారు. దాదాపు మూడు దశాబ్దాల సినీ కెరీర్లో 3వేలకు పైగా పాటలు రాసిన సిరివెన్నెలకు కొన్ని రకాల పాటలు రాయడం అస్సలు నచ్చదట. ఎంత డబ్బు ఇచ్చిన సరే అలాంటి పాటలు రాసేవాడు కాదంట. ఈ విషయాన్ని సిరివెన్నెలనే స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.
హీరో, హీరోయిన్ ఇంట్రడక్షన్ పాటలను రాయడం తనకు ఇబ్బందిగా ఉంటుందని సిరివెన్నెల సీతారామశాస్త్రి ఒక సందర్భంలో తెలిపారు. అందుకే సంఘటనలు, వ్యక్తులు, ప్రదేశాలపై తనను పాటలను రాయమని చెప్పొద్దని తన డైరెక్టర్లు, నిర్మాతలకు చెప్పేవాడినని చెప్పారు. తన అనుభూతుల్ని మాత్రమే పాటలుగా రాసేవాడినని అన్నారు. కఠినమైన పాట రాసేంత భాష తనకు రాదన్నారు. తనకు అష్టయిశ్వర్యాల కంటే వ్యక్తిత్వమే ముఖ్యమని చెప్పుకొచ్చారు. ఇది నా పాట అని ప్రతి ప్రేక్షకుడు అనుకునేలా తన పాటలు ఉండాలని అనుకుంటానని చెప్పాడు. తన పాటల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ స్త్రీని కించపరచనని స్పష్టం చేశారు. సినిమాలో ఆ పాత్ర ఎలాంటిది అయినా సరే అవమానిస్తూ రాయడం తనకు ఇష్టం ఉండదన్నారు. శృంగార రచనలు చేస్తాను కానీ.. అవి కుటుంబసభ్యులతో వినగలిగేలా మాత్రమే ఉంటాయన్నారు. అంతేతప్ప అంగాంగ వర్ణనలు మాత్రం చేయనని చెప్పుకొచ్చారు. అలాగే కుర్రకారును రెచ్చగొట్టే పాటలు అస్సలే రాయనని అన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
సిరివెన్నెల సీతారామశాస్త్రి జీవితంలో కీలకమైన ఘట్టాలు ఇవే..
సిరివెన్నెల సీతారామశాస్త్రికి అవార్డులు తీసుకొచ్చిన పాటలు ఇవే..
Sirivennela | సిరివెన్నెలకు ఆ పేరెలా వచ్చిందో తెలుసా?
నా పాటల్లో ఎప్పుడూ నేను కనిపించొద్దు.. సిరివెన్నెల కోరిక ఎప్పుడూ అదే
sirivennela | సిరివెన్నెల మృతిపై కిమ్స్ ఆస్పత్రి వైద్యులు ఏమన్నారంటే..
అష్టైశ్వర్యాలకంటే ఎక్కువగా వ్యక్తిత్వానికే విలువిస్తాను: సిరివెన్నెల
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Uttam Kumar Reddy | బ్యారేజెస్ రిహాబిలిటేషన్ చెబుతున్నట్టు నీళ్లు ఎత్తిపోయలేం : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
Fire Accident | నోయిడాలో భారీ అగ్నిప్రమాదం.. ఒకరు మృతి.. పలు దుకాణాలు అగ్నికి ఆహుతి..!
Men Check Into Hotel With Girls | ఇద్దరు బాలికలతో కలిసి హోటల్లో బస చేసిన ఇద్దరు వ్యక్తులు.. తర్వాత ఏం జరిగిందంటే?
MLA Sudheer Reddy | బటన్ ఒత్తితే నీళ్లొస్తయని చెప్పినం.. హైదరాబాద్‌కు ఏడాదికి 10 టీఎంసీల నీళ్లు సరిపోతయి : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
Kriti Sanon | మన బట్టలు, మన ఇష్టం.. కామెంట్ చేసే హక్కు వాళ్లకు ఎవరిచ్చారు?: కృతి సనన్ ఫైర్!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

