సిరివెన్నెల సీతారామశాస్త్రికి అవార్డులు తీసుకొచ్చిన పాటలు ఇవే..

Sirivennela Seetharama Sastry | మూడు వేలకు పైగా పాటలు రాసి.. తెలుగు సినిమా సాహిత్య స్థాయిని ఎన్నో వందల రెట్లు పెంచిన సిరివెన్నెల సీతారామశాస్త్రి ఇకలేరు అనే విషయాన్ని సంగీత ప్రియులు జీర్ణించుకోలేకపోతున్నారు. కొన్ని రోజుల కిందటి వరకు కూడా ఎంతో ఆరోగ్యంగా కనిపించిన ఆయన.. గత వారం రోజులుగా న్యుమోనియాతో బాధ పడుతూ.. లంగ్ క్యాన్సర్ కారణంగా నవంబర్ 30 సాయంత్రం 4:07 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. ఆయన కెరీర్ లో రాసిన ప్రతీ పాట ఒక ఆణిముత్యమే. ఎన్నో వేల పాటలు రాసిన ఆయనకు ఎవరికీ సాధ్యం కాని రీతిలో 11 నంది అవార్డులు వరించాయి. అలాగే నాలుగు ఫిలింఫేర్ అవార్డులు కూడా సొంతం చేసుకున్నారు సిరివెన్నెల.
నంది అవార్డులు.. పాట
- సిరివెన్నెల (1986) – విధాత తలపున
- శృతిలయలు (1987) – తెలవారదేమో స్వామి
- స్వర్ణకమలం (1988) – అందెలరావమిది పదములదా
- గాయం (1993) – సురాజ్యమవలనీ స్వరాజ్యమెందుకని
- శుభ లగ్నం (1994) – చిలక ఏ తోడు లేక
- శ్రీకారం (1996) – మనసు కాస్త కలత పడితే
- సింధూరం (1997) – అర్ధ శతబ్దపు అజ్ఞానాన్నే
- ప్రేమ కథ (1999) – దేవుడు కరుణిస్తాడని
- చక్రం (2005) – జగమంత కుటుంబం నాది
- గమ్యం (2008) – ఎంత వరకు ఎందుకు కోరకు
- సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు (2013) – మరీ అంతగా
ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్ (తెలుగు)..
- నువ్వొస్తానంటే నేనొద్దంటానా (2005)
- గమ్యం (2008)
- మహాత్మ (2009)
- కంచె (2015)
SIIMA అవార్డ్స్
ఉత్తమ గేయ రచయిత (తెలుగు) – కంచె (2015)
కేవలం అవార్డులు తీసుకొచ్చిన పాటలు మాత్రమే గొప్పది అని కాదు. అవార్డు వచ్చినా రాకపోయినా ‘సిరివెన్నెల’ కలం నుంచి జాలువారిన ఎన్నో పాటలు ఆణిముత్యాలుగా మిగిలిపోయాయి. ఉదాహరణకు చిరంజీవి నటించిన రుద్రవీణ సినిమాలోని అన్ని పాటలు ఒక అద్భుతం. ‘నమ్మకు నమ్మకు ఈ రేయిని’, ‘తరలి రాద తనే వసంతం’ పాటలను ప్రేక్షకులు ఎప్పుడూ మర్చిపోలేరు. కేవలం యుగళ గీతాలు మాత్రమే కాకుండా విప్లవ పాటలు, ఎన్నో స్ఫూర్తి రగిలించే పాటలు రాయడంలో సిరివెన్నెల అందెవేసిన చేయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
సిరివెన్నెల సీతారామశాస్త్రి జీవితంలో కీలకమైన ఘట్టాలు ఇవే..
Sirivennela | సిరివెన్నెలకు ఆ పేరెలా వచ్చిందో తెలుసా?
నా పాటల్లో ఎప్పుడూ నేను కనిపించొద్దు.. సిరివెన్నెల కోరిక ఎప్పుడూ అదే
sirivennela | సిరివెన్నెల మృతిపై కిమ్స్ ఆస్పత్రి వైద్యులు ఏమన్నారంటే..
అష్టైశ్వర్యాలకంటే ఎక్కువగా వ్యక్తిత్వానికే విలువిస్తాను: సిరివెన్నెల
shiva shankar master | వెన్నెముక గాయం.. ఎనిమిదేళ్లు మంచంపైనే.. అయినా 800 సినిమాలకు కొరియోగ్రఫీ
shiva shankar | శివ శంకర్ మాస్టర్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Uttam Kumar Reddy | బ్యారేజెస్ రిహాబిలిటేషన్ చెబుతున్నట్టు నీళ్లు ఎత్తిపోయలేం : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
Fire Accident | నోయిడాలో భారీ అగ్నిప్రమాదం.. ఒకరు మృతి.. పలు దుకాణాలు అగ్నికి ఆహుతి..!
Men Check Into Hotel With Girls | ఇద్దరు బాలికలతో కలిసి హోటల్లో బస చేసిన ఇద్దరు వ్యక్తులు.. తర్వాత ఏం జరిగిందంటే?
MLA Sudheer Reddy | బటన్ ఒత్తితే నీళ్లొస్తయని చెప్పినం.. హైదరాబాద్‌కు ఏడాదికి 10 టీఎంసీల నీళ్లు సరిపోతయి : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
Kriti Sanon | మన బట్టలు, మన ఇష్టం.. కామెంట్ చేసే హక్కు వాళ్లకు ఎవరిచ్చారు?: కృతి సనన్ ఫైర్!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

