Sirivennela | సిరివెన్నెలకు ఆ పేరెలా వచ్చిందో తెలుసా?

Sirivennela Seetharama Sastry | వేటూరి తర్వాత తెలుగు పాటకు అంతటి గౌరవాన్ని తీసుకొచ్చిన వ్యక్తి సిరివెన్నెల సీతారామశాస్త్రి. అత్యంత సరళమైన పదాలతో వాడుక భాషలో ఆయన రాసిన పాటలు తెలుగు ప్రేక్షకుల గుండెల్లో అలాగే నిలిచిపోయాయి. సిరివెన్నెల సినిమాతో తన ప్రస్థానాన్ని మొదలుపెట్టిన సీతారామశాస్త్రి.. ఆ సినిమా పేరునే తన ఇంటిపేరుగా మార్చుకున్నారు. అయితే సిరివెన్నెల సినిమాలోని పాటలు హిట్ కావడం వల్ల ఆయన సిరివెన్నెల సీతారామశాస్త్రి కాలేదు. దాని వెనుక కారణం వేరే ఉంది. దాన్ని సిరివెన్నెలనే ఒక సందర్భంలో తెలిపారు.
తొలి అవకాశం అలా వచ్చింది
1983లో కాకినాడలో జరిగిన ఒక కార్యక్రమంలో కళాతపస్వి, దర్శకుడు కె.విశ్వనాథ్‌ను కలిసే అవకాశం సీతారామశాస్త్రికి దక్కింది. ఆ సమయంలో తాను రాసిన పాటలను కె.విశ్వనాథ్‌కు వినిపించారు. ఆ పాటల్లో మంచి భావుకత ఉందని విశ్వనాథ్ ఫీలయ్యారు. కానీ ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. అలా ఒక ఏడాది గడిచిపోయింది. సిరివెన్నెల సినిమా తీస్తున్న సమయంలో కళాతపస్వికి ఒక కొత్త లిరిసిస్ట్ అవసరం పడింది. అప్పుడు ఏడాది కిందట కలిసిన చేబోలు సీతారామశాస్త్రి గుర్తుకొచ్చాడు విశ్వనాథ్‌కి. దీంతో ఆకెళ్ల సాయినాథ్ ద్వారా సీతారామశాస్త్రికి కబురు పంపించాడు.
ఆ పేరు వెనుకున్నది ఆయనే
ఆ రోజుల్లో ఒక సినిమాలో ఆరు పాటలు ఉంటే.. ఒక్కో పాట ఒక్కో రచయిత రాసేవారు. జానపదం అయితే కొసరాజు.. ఫీల్‌గుడ్ పాట అయితే ఆత్రేయ, క్లబ్ పాటలు అయితే ఆరుద్ర రాసేవారు. అప్పుడు టైటిల్ కార్డు దగ్గర మూడు, నాలుగు పేర్లు పడేవి. అలాంటి సమయంలో కె.విశ్వనాథ్ ధైర్యం చేసి.. అన్ని పాటలను సీతారామశాస్త్రితోనే రాయించాడు. ఆ పాటలు అన్నీ సూపర్ హిట్ అయ్యాయి. ఈ సినిమాతో సీతారామశాస్త్రి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించుకున్నాడు. అయితే సిరివెన్నెల సినిమాలో పాటలు హిట్ కావడంతో సీతారామశాస్త్రి పేరు ముందు సిరివెన్నెల చేరిందని చాలామంది అనుకుంటుంటారు. కానీ అది నిజం కాదంట. ఇదే విషయాన్ని స్వయంగా సిరివెన్నెలనే ఒక సందర్భంలో వివరించారు. ఆ సినిమా వల్ల నాకు ఈ పేరు రాలేదు. ఆ సినిమా టైటిల్ కార్డ్స్‌లోనే సిరివెన్నెల సీతారామశాస్త్రి అని వేశారు అని గుర్తు చేసుకున్నారు.
భరణి పేరుతో కవితలు, పాటలు
మొదట్లో సీతారామశాస్త్రి భరణి కలం పేరుతో కవితలు, పాటలు రాసేవారు. అది గమనించిన కె.విశ్వనాథ్.. తల్లిదండ్రులు పెట్టిన లక్షణమైన పేరు ఉండగా.. వేరే పేరు ఎందుకని హితబోధ చేశారని చెప్పాడు. అంతగా స్క్రీన్ నేమ్ కావాలని అనుకుంటే.. సిరివెన్నెల సినిమా టైటిల్‌ను తన పేరు ముందు చేర్చుకోమని చెప్పారని అన్నాడు. అలా సినిమా టైటిల్ కార్డ్స్‌లోనే సిరివెన్నెల సీతారామశాస్త్రి అని పేరు వేశారని గుర్తు చేసుకున్నాడు. వశిష్ట మహర్షి రాముడికి పేరు పెట్టినట్టు నాకు విశ్వనాథ్ పేరు పెట్టారని గుర్తు చేసుకున్నారు. మా నాన్న గారు జన్మనిస్తే.. నాకు సినీ నామకరణం చేసి, కవిగా జన్మనిచ్చిన తండ్రి కె.విశ్వనాథ్ అని చెప్పారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Sirivennela Sitaramasastri | సిరివెన్నెల సీతారామశాస్త్రి కన్నుమూత
సిరివెన్నెల సీతారామశాస్త్రి జీవితంలో కీలకమైన ఘట్టాలు ఇవే..
నా పాటల్లో ఎప్పుడూ నేను కనిపించొద్దు.. సిరివెన్నెల కోరిక ఎప్పుడూ అదే
sirivennela | సిరివెన్నెల మృతిపై కిమ్స్ ఆస్పత్రి వైద్యులు ఏమన్నారంటే..
అష్టైశ్వర్యాలకంటే ఎక్కువగా వ్యక్తిత్వానికే విలువిస్తాను: సిరివెన్నెల
shiva shankar master | వెన్నెముక గాయం.. ఎనిమిదేళ్లు మంచంపైనే.. అయినా 800 సినిమాలకు కొరియోగ్రఫీ
shiva shankar | శివ శంకర్ మాస్టర్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Uttam Kumar Reddy | బ్యారేజెస్ రిహాబిలిటేషన్ చెబుతున్నట్టు నీళ్లు ఎత్తిపోయలేం : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
Fire Accident | నోయిడాలో భారీ అగ్నిప్రమాదం.. ఒకరు మృతి.. పలు దుకాణాలు అగ్నికి ఆహుతి..!
Men Check Into Hotel With Girls | ఇద్దరు బాలికలతో కలిసి హోటల్లో బస చేసిన ఇద్దరు వ్యక్తులు.. తర్వాత ఏం జరిగిందంటే?
MLA Sudheer Reddy | బటన్ ఒత్తితే నీళ్లొస్తయని చెప్పినం.. హైదరాబాద్‌కు ఏడాదికి 10 టీఎంసీల నీళ్లు సరిపోతయి : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
Kriti Sanon | మన బట్టలు, మన ఇష్టం.. కామెంట్ చేసే హక్కు వాళ్లకు ఎవరిచ్చారు?: కృతి సనన్ ఫైర్!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

