Sirivennela Seetharama Sastry | సాధారణంగా సిరివెన్నెల సీతారామశాస్త్రి కలం తెర వెనక మాత్రమే మాయాజాలం చేస్తోంది.. తెర ముందు కాదు. ఆయనకు నటుడిగా కూడా ఎన్నో అవకాశాలు వచ్చాయి. కానీ ఏ ఒక్క రోజు కూడా తన పరిధి దాటి బయటికి వెళ్లలేదు. సినిమాలో పాటలు రాసే సమయంలోనే.. గురువుగారు మీరు ఎందుకు నటించకూడదు అంటూ చాలా మంది దర్శకులు అతడిని అడిగారు. కానీ ఎంతమంది తన దగ్గరికి వచ్చి నటించాలంటే కోరినా కూడా తాను కేవలం తెర వెనక మాత్రమే పాత్రలకు పాటలు రాస్తాను కానీ.. తెర మీద పాత్ర పోషించలేను అంటూ సున్నితంగా తిరస్కరించేవారు సిరివెన్నెల సీతారామశాస్త్రి. అలాంటి లెజెండరీ లిరిక్ రైటర్ ఒక సినిమాలో నటించారు. అది కూడా కేవలం ఆ దర్శకుడి మీద ఉన్న గౌరవం ఇష్టంతోనే స్క్రీన్ మీద కల్పించారు.
ఆ సినిమా పేరు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జగపతి బాబు హీరోగా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన గాయం సినిమా. 1993లో విడుదలైన ఈ సినిమాలో సిరివెన్నెల సీతారామ శాస్త్రి కూడా నటించారు. అది కేవలం వర్మ పై ఉన్న అభిమానంతో మాత్రమే చేశారు ఆయన. పైగా నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని అంటూ తనదైన మాటల తూటాలతో పాట రాసి అందులో అభినయించారు సీతారామశాస్త్రి. ఈ పాట తెలుగు ఇండస్ట్రీలో ఎప్పటికీ నిలిచిపోయే అద్భుతమైన విప్లవ గీతంగా మారిపోయింది.
మనల్ని మనం ఎప్పుడు ప్రశ్నించుకునే విధంగా ఈ పాట రాశారు సీతారామశాస్త్రి. గాయం సినిమా తర్వాత చాలా మంది దర్శకులు తమ సినిమాల్లో కూడా నటించాలి అంటూ సిరివెన్నెలను ఎన్నోసార్లు కాస్త బలవంతపెట్టారు. అందులో పెద్ద పెద్ద దర్శకులు కూడా ఉన్నారు. కానీ ఎంత మంది వచ్చి తనను అడిగినా కూడా ఒకే మాట చెప్పేవారు సిరివెన్నెల. తనకు నటన రాదు.. పాటలు రాయడం వరకు మాత్రమే తన పని అంటూ అక్కడే ఉండిపోయారు. కాకపోతే మనసంతా నువ్వే సినిమాలో తన పాత్రలోనే గెస్ట్ అప్పిరియన్స్ ఇచ్చాడు. కానీ వేరే పాత్రల్లో మాత్రం నటించలేదు. తన పాటల్లో తాను కనిపించడానికి ఇష్టపడేవారు కాదు ఈ లెజెండరీ లిరిక్ రైటర్.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
సిరివెన్నెల సీతారామశాస్త్రి జీవితంలో కీలకమైన ఘట్టాలు ఇవే..
సిరివెన్నెల సీతారామశాస్త్రికి అవార్డులు తీసుకొచ్చిన పాటలు ఇవే..
‘సిరివెన్నెల దురదృష్టం..తెలుగు వారి అదృష్టం..’ త్రివిక్రమ్ స్పీచ్ వీడియో ట్రెండింగ్
సిరివెన్నెల, త్రివిక్రమ్ శ్రీనివాస్ మధ్య ఉన్న బంధుత్వం ఏంటో తెలుసా?
sirivennela songs | అలాంటి పాటలను రాయలేను : సిరివెన్నెల
Sirivennela | సిరివెన్నెలకు ఆ పేరెలా వచ్చిందో తెలుసా?
నా పాటల్లో ఎప్పుడూ నేను కనిపించొద్దు.. సిరివెన్నెల కోరిక ఎప్పుడూ అదే
sirivennela | సిరివెన్నెల మృతిపై కిమ్స్ ఆస్పత్రి వైద్యులు ఏమన్నారంటే..
అష్టైశ్వర్యాలకంటే ఎక్కువగా వ్యక్తిత్వానికే విలువిస్తాను: సిరివెన్నెల