Amaran | కోలీవుడ్ స్టార్ యాక్టర్ శివకార్తికేయన్ (Sivakarthikeyan) లీడ్ రోల్లో తెరకెక్కిన నటించిన చిత్రం అమరన్ (Amaran). మేజర్ ముకుంద్ జీవితంలోని పలు కోణాలను ఆవిష్కరిస్తూ తెరకెక్కిన ఈ మూవీ అక్టోబర్ 31న తెలుగు, తమిళంతోపాటు వివిధ భాషల్లో గ్రాండ్‌గా విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంటోంది. సూర్య నటించిన కంగువ నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే.
కంగువ విడుదలతో అమరన్ వసూళ్లు తగ్గుతాయని అంతా అనుకున్నారు. కానీ ఆశ్చర్యకరంగా కంగువకు నెగెటివ్ రివ్యూస్ రావడంతో అమరన్ మూవీ లవర్స్‌కు మెయిన్ ఛాయిస్‌గా మారిపోయింది. అమరన్ థర్డ్ వీకెండ్లో కూడా అద్భుతమైన ఆక్యుపెన్సీతో సక్సెస్ఫుల్ స్క్రీనింగ్ అవుతూ రూ.300 కోట్లకుపైగా గ్రాస్ రాబట్టింది. కేవలం కొద్దిమంది తమిళ హీరోలకు మాత్రమే సాధ్యమైన అరుదైన ఫీట్‌ను నమోదు చేసి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తున్నాడు శివకార్తికేయన్. ఈ చిత్రానికి తెలుగులో కూడా మంచి టాక్ వస్తోంది.
SK21గా తెరకెక్కిన ఈ చిత్రానికి రాజ్‌కుమార్ పెరియసామి (Rajkumar Periasamy) దర్శకత్వం వహించాడు. జీవీ ప్రకాశ్ కుమార్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించిన ఈ మూవీలో విశ్వరూపం ఫేం రాహుల్ బోస్ (RahulBose) విలన్‌గా నటించాడు.
#Amaran Enters into 300Cr club in just 19 Days & it’s still running strong 👌🔥
What a phenomenal growth of #SivaKartikeyan 🫡📈 pic.twitter.com/XINqEo9CR8— AmuthaBharathi (@CinemaWithAB) November 19, 2024
Pushpa 2 The Rule | పుష్ప 2 ది రూల్ రిలీజ్ ఆన్ ది వే.. తెలుగు ప్రేక్షకులకు బ్యాడ్ న్యూస్..!