Sai Pallavi | మేజర్ ముకుంద్ జీవితంలోని పలు కోణాలను ఆవిష్కరిస్తూ అమరన్ (Amaran) సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కోలీవుడ్ స్టార్ యాక్టర్లు శివకార్తికేయన్ (Siva karthikeyan) మేజర్ ముకుంద్ పాత్రలో నటిస్తుండగా.. సాయిపల్లవి (Sai Pallavi) మేజర్ ముకుంద్ సతీమణి ఇందు రెబెకా వర్గీస్ పాత్రలో నటిస్తోంది.
SK21గా వస్తున్న ఈ చిత్రానికి రాజ్‌కుమార్ పెరియసామి (Rajkumar Periasamy) దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా అమరన్ ట్రైలర్‌ను ఇవాళ సాయంత్రం 6 గంటలకు లాంచ్ చేస్తున్నట్టు తెలియజేస్తూ.. కొత్త లుక్ విడుదల చేశారు. జవాన్ల చప్పట్ల మధ్య మేజర్ ముకుంద్-ఇందు వర్గీస్ హ్యాపీ మూడ్‌లో ఉండటం చూడొచ్చు. ఈ లుక్ సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తుంది.
ఇప్పటికే ఈ సినిమా నుంచి జీవీ ప్రకాశ్ కుమార్ కంపోజిషన్‌లో విడుదల చేసిన ఫస్ట్ సింగిల్ హే రంగులేతోపాటు Vennilavu Saaral పాటలకు మంచి స్పందన వస్తోంది. ఇక సాయిపల్లవి రెబెకా వర్గీస్ పాత్రకు సంబంధించిన ఇంట్రడక్షన్ వీడియో నెటిజన్లను ఇంప్రెస్ చేస్తోంది. ఈ మూవీలో విశ్వరూపం ఫేం రాహుల్ బోస్ (RahulBose) విలన్‌గా నటిస్తున్నాడు. కథానుగుణంగా ఈ చిత్రంలో ఎక్కువ భాగం కశ్మీర్లో షూట్ చేశారు.
#AmaranTrailer from today at 6pm#AmaranDiwali #AmaranOctober31 #MajorMukundVaradharajan#Ulaganayagan #KamalHaasan #Sivakarthikeyan #SaiPallavi #RajkumarPeriasamy
A Film By @Rajkumar_KP @ikamalhaasan @Siva_Kartikeyan #Mahendran @Sai_Pallavi92 @gvprakash @anbariv… pic.twitter.com/Mknk3Ljh6r
— Raaj Kamal Films International (@RKFI) October 23, 2024
War 2 | హృతిక్ రోషన్ వర్సెస్ తారక్ .. వార్ 2లో అదిరిపోయే కత్తిసాము సీక్వెన్స్