అల్లు ఫ్యామిలీ నుండి వచ్చిన మరో హీరో శిరీష్ మంచి హిట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం తన ఆరో సినిమాతో బిజీగా ఉన్నాడు శిరీష్. రీసెంట్గా శిరీష్ ఆరో సినిమాకు సంబంధించిన రొమాంటిక్ ప్రీ లుక్ పోస్టర్ విడుదల చేయగా, ఇందులో చేతులు అడ్డు పెట్టి మరీ ముద్దులాటలో మునిగిపోయారు అను ఎమ్మాన్యుయేల్, శిరీష్. తాజాగా మరో ప్రీ లుక్ విడుదల చేశారు. ఇందులో ఈ జంట బెడ్ మీద చేతులు అడ్డుపెట్టి రొమాంటిక్ మూడ్ లోకి వెళ్లినట్టుగా ఉంది.
శిరీష్ పుట్టినరోజు సందర్భంగా మే 30న ఉదయం 11 గంటలకు ఫస్ట్ లుక్ విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం తెలియజేసింది. అల్లు శిరీష్ – అను ఇమాన్యేయేల్ ఇద్దరూ కూడా గత కొన్నేళ్లుగా సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. శిరీష్ నుంచి రెండేళ్ల క్రితం వచ్చిన మలయాళ రీమేక్ ‘ఏబీసీడీ’ నిరాశ పరిచింది. ఇక అనూ బేబీ చివరగా చేసిన ‘అల్లుడు అదుర్స్’ సినిమా ప్లాప్ అయింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇద్దరికీ ఓ హిట్ సినిమా అవసరం ఎంతైనా ఉంది. ఇందులో శిరీష్ తన సిక్స్ ప్యాక్‌తో అలరించనున్నాడు. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్ పై బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీ తిరుమల ప్రొడక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ వారు నిర్మాణంలో భాగస్వాములుగా వ్యవహరిస్తున్నారు.