Zubeen Garg | అస్సామీ (Assamese singer) చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. స్కూబా డైవింగ్ ప్రమాదంలో ఓ ప్రముఖ గాయకుడు ప్రాణాలు కోల్పోయారు. అస్సామీ ప్రముఖ గాయకుడు జుబీన్ గార్గ్ (Zubeen Garg) ఓ ప్రదర్శన నిమిత్తం సింగపూర్ (Singapore) వెళ్లారు. అక్కడ స్కూబా డైవింగ్ (scuba diving) చేస్తూ ప్రమాదానికి గురయ్యారు. సింగపూర్ పోలీసులు అతడిని రక్షించి సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ జుబీన్ గార్గ్ ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం ఆయన వయసు 52 ఏండ్లు.
కాగా, జుబీన్.. కంగనా రనౌత్ నటించిన బాలీవుడ్ చిత్రం ‘గ్యాంగ్‌స్టర్’లోని ‘యా అలీ’ (Ya Ali) పాటతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. అంతేకాదు పలు బాలీవుడ్ చిత్రాలకు హిట్ సాంగ్స్‌ను అందించారు. హిందీతోపాటూ అస్సామీ, బెంగాలీ, నేపాలీ సహా ఇతర ప్రాంతీయ భాషల్లో పాటలు పాడి కోట్లాది మంది అభిమానుల్ని సొంతం చేసుకున్నారు. ఆయన మరణవార్తతో అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. గార్గ్ మరణ వార్త తెలుసుకున్న పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
Also Read..
Bhadrakaali Movie | భద్రకాళి మూవీ రివ్యూ.. విజయ్ ఆంటోని పొలిటికల్ థ్రిల్లర్ అలరించిందా?
Kantara Chapter 1 | ‘కాంతార: చాప్టర్ 1’ ట్రైలర్‌కు ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడంటే.!
Nag Ashwin | ‘కల్కి’ నుంచి దీపిక అవుట్.. కర్మ నుంచి ఎవరూ తప్పించుకోలేరు అంటూ నాగ్ అశ్విన్ పోస్ట్