Nag Ashwin | ‘కల్కి’ 2898 AD సినిమా సీక్వెల్ నుంచి ప్రముఖ నటి దీపికా పదుకొణెను తొలగిస్తూ చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. కల్కి ఫస్ట్ పార్ట్‌లో కీలక పాత్రలో నటించిన దీపికా రెండో భాగంలో నటించట్లేదని వైజయంతీ మూవీస్ గురువారం వెల్లడించింది. ఒక ప్రాజెక్ట్‌కు పూర్తి కమిట్మెంట్ అవసరమని కానీ దీపికాతో ఆ కమిట్మెంట్ను కొనసాగించలేకపోయామని నిర్మాణ సంస్థ పేర్కొంది. అయితే దీని వెనుక ఉన్న అసలు కారణాన్ని మాత్రం వైజయంతీ వెల్లడించలేదు. మరోవైపు తన రెమ్యునరేషన్ పెంచాలని రోజుకు కేవలం ఏడు గంటలే పనిచేస్తానని అలాగే తనతో వచ్చే 25 మంది టీమ్‌కు ఫైవ్ స్టార్ వసతులు కావాలని దీపికా డిమాండ్ చేసిందని కొన్ని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలపై దీపికా పదుకొణె కానీ ఆమె బృందం కానీ ఇంతవరకు అధికారికంగా స్పందించలేదు. ఈ వివాదంపై ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చ నడుస్తుండగా.. ఈ చిత్ర దర్శకుడు నాగ్ అశ్విన్ పెట్టిన పోస్ట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది.
నాగ్ అశ్విన్ కల్కి సినిమాలోని ఒక వీడియోని ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తూ.. కృష్ణుడు అశ్వత్థామతో చెప్పిన ‘కర్మ నుంచి ఎవరూ తప్పించుకోలేరు, నీ కర్మను నువ్వు అనుభవించాల్సిందే’ అని చెప్పే డైలాగ్‌ను షేర్ చేశాడు. దీనికి ‘జరిగిన దాన్ని మనం మార్చలేం, కానీ తర్వాత ఏం జరగాలో మనమే నిర్ణయించుకోవచ్చు’ అని రాసుకొచ్చాడు. అయితే ఈ పోస్ట్‌ను నాగ్ అశ్విన్ దీపికాను ఉద్దేశించే పెట్టారని పలువురు కామెంట్లు పెడుతున్నారు.
Director #NagAshwin Insta Story.#Kalki2898AD #TeluguFilmNagar pic.twitter.com/wB4ncWon87
— Telugu FilmNagar (@telugufilmnagar) September 18, 2025