విఖ్యాత గాయని ఎస్.జానకి ఇంట విషాదం నెలకొన్నది. ఆమె ఏకైక కుమారుడు మురళీకృష్ణ(65) గురువారం ఉదయం కన్నుమూశారు. భరతనాట్యంలో ప్రావీణ్యం ఉన్న మురళీకృష్ణ పలు తెలుగు, తమిళ చిత్రాల్లోనూ నటించారు. తెలుగులో వినాయకుడు, మల్లెపువ్వు చిత్రాల్లో ఆయన కనిపించారు. ‘కూలింగ్ గ్లాసెస్’ అనే మలయాళ చిత్రానికి రచయితగా కూడా పనిచేశారు. మురళీకృష్ణకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
ఆయన మరణం తనను షాక్‌కి గురిచేసిందనీ, మురళీకృష్ణ ఆత్మకు శాంతి చేకూరాలంటూ ప్రముఖ గాయని చిత్ర తన సోషల్ మీడియా ద్వారా విచారం వ్యక్తం చేశారు. గతంలో ఎస్.జానకి ఆరోగ్యంపై మీడియాలో వచ్చిన వదంతుల్ని మురళీకృష్ణే ఖండించారు. ఇప్పుడు ఆయనే కన్నుమూయడంతో జానకి కుటుంబం విషాదంలో మునిగిపోయింది.