Simbu | కోలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ హీరోల్లో టాప్‌లో ఉంటాడు శింబు (Simbu). ఇప్పటికే ఈ స్టార్ యాక్టర్ పలువురు భామలతో డేటింగ్, లవ్ ఎఫైర్ వార్తలతో హాట్ టాపిక్‌గా మారాడని ప్రత్యేకించి చెప్పనసవరం లేదు. అయితే శింబు పెండ్లి ఎప్పుడుంటుంది.. ఎవరిని పెండ్లి చేసుకుంటాడనేది మాత్రం సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. డైలామాకు తెరదించుతూ శింబు ప్రేమ వివాహం చేసుకుంటాడని.. అతని తండ్రి టీ రాజేందర్ గతంలో క్లారిటీ ఇచ్చాడు.
ఇదిలా ఉంటే శింబు పెండ్లి పీటలెక్కబోతున్నాడన్న వార్త ఒకటి కోలీవుడ్ సర్కిల్లో రౌండప్ చేస్తోంది. ఇంతకీ ఈ స్టార్ హీరో ఎవరిని వివాహం చేసుకోబోతున్నాడనే కదా మీ డౌటు. ఆ అమ్మాయి ఎవరో కాదట. శింబు మనువాడబోయేది ఇస్మా్ర్ట్ భామ నిధి అగర్వాల్ (Nidhhi Agerwal) నేనని నెట్టింట ఓ గాసిప్ మార్మోగిపోతుంది.
మూడేళ్ల క్రితం ఓ సినిమాకు పనిచేసే క్రమంలో శింబు, నిధి అగర్వాల్ తొలిసారి కలిశారని, అప్పటి నుంచి ఇద్దరు ప్రేమలో మునిగి తేలుతున్నారంటూ పుకార్లు షికారు చేస్తున్నాయి. వీరిద్దరూ వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టేందుకు రెడీ అవుతున్నారంటూ చర్చ నడుస్తోంది. అయితే ఈ పుకార్లపై శింబు కానీ, నిధి అగర్వాల్ గానీ ఎలా స్పందిస్తారనేది చూడాలి.
శింబు గతంలో నయనతారతో రిలేషన్షిప్లో ఉన్నాడని తెలిసిందే. ఆ తర్వాత హన్సికతో డేటింగ్లో ఉన్నాడంటూ వార్తలు వచ్చాయి. మరోవైపు నటి సుభిక్షతో కూడా రిలేషన్షిప్ మెయింటైన్ చేశాడంటూ కథనాలు వచ్చాయి. ఇవన్నీ పక్కన పెడితే శింబు ఈ సారి మాత్రం పెండ్లి కొడుకవడం ఖాయమని కొందరు అభిమానులు బలంగా విశ్వసిస్తున్నారన్న టాక్ కూడా ఉంది. మరి ఈసారైనా శింబు బ్యాచ్ లర్ లైఫ్‌కు గుడ్ బై చెప్పడం ఖాయమైనట్టేనా..? అనేది తెలియాల్సి ఉంది.
Kamal Haasan | సల్మాన్ ఖాన్, అట్లీ సినిమాకు కమల్ హాసన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేనా..?
Kannappa | పిలక-గిలకగా సప్తగిరి, బ్రహ్మానందం.. మంచు విష్ణు కన్నప్ప నయా లుక్ వైరల్