సినిమా అంటే ఇష్టపడే ప్రతీ ఒక్కరికి పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు సిల్క్ స్మిత (Silk Smitha). 80లలో అగ్రహీరోలతో కలిసి నటించి తన హాట్ హాట్ అందాలతో ఇండస్ట్రీని ఓ ఊపు ఊపింది. కైపెక్కించే కళ్లతో మత్తెక్కించే అందంతో కుర్రకారు గుండెల్ని పిండేసింది. సిల్క్ స్మిత ఉందంటే చాలు ఆ సినిమాకు బాక్సాపీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురవాల్సిందే.
వెండితెరపై సిల్క్ స్మిత బయోపిక్ (Silk Smitha Biopic) కూడా రాగా విద్యాబాలన్ లీడ్ రోల్లో నటించింది. చాలా గ్యాప్ తర్వాత సిల్క్ స్మిత స్టిల్ ఒకటి ఇపుడునెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది. సిల్క్ స్మిత యుక్త వయసులో ఉన్నపుడు వైల్ కుర్తాలో దిగిన బ్లాక్ అండ్ వైట్ ఫొటో ఇపుడు నెట్టింటిని షేక్ చేసుకుంది.
ఈ ఫొటోలో కళ్లతో మ్యాజిక్ చేస్తూ అందరినీ కట్టిపడేస్తుంది సిల్క్ స్మిత. 1996 సెప్టెంబర్ 23న సిల్క్ స్మిత అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Manchi Rojulochaie Title Song| సరదాగా ‘మంచి రోజులొచ్చాయి’ టైటిల్ సాంగ్
Ranbir Alia wedding| రణ్‌బీర్‌కపూర్-అలియా పెళ్లిపై తాజా అప్డేట్..!
Pooja Hegde New Look | దీపావళి ఫెస్టివ్ సీజన్ లుక్‌లో పూజాహెగ్డే
Kajal Aggarwal | సమంత, పూజాహెగ్డేను బీట్‌చేసిన కాజల్