Thug life | కోలీవుడ్ స్టార్ హీరో శింబు ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెట్టాడని తెలిసిందే. వీటిలో ఒకటి కీలక పాత్రలో నటిస్తోన్న ‘థగ్ లైఫ్’ (Thug life). మణిరత్నం దర్శకత్వంలో వస్తోన్న కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటిసోన్న ఈ మూవీ KH234గా తెరకెక్కుతోంది. థగ్ లైఫ్‌లో ఐశ్వర్యలక్ష్మి, త్రిష, ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తుండగా.. పాపులర్ మాలీవుడ్ యాక్టర్ జోజు జార్జ్, గౌతమ్ కార్తీక్, దుల్కర్ సల్మాన్, జయం రవి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
ఈ సినిమా అప్డేట్ ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్న వారి కోసం చాలా రోజుల తర్వాత ఆసక్తికర వార్తను షేర్ చేశారు మేకర్స్. వర్క్ మూడ్.. అంటూ లొకేషన్లో దిగిన స్టిల్‌ను సోషల్ మీడియా ద్వారా షేర్ చేశాడు శింబు. వైట్ అండ్ వైట్ డ్రెస్‌లో ఉన్న శింబు లుక్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
థగ్ లైఫ్‌లో శింబు పాత్ర ఎలా ఉండబోతుందో తెలియజేస్తూ.. Sigma Thug Rule అంటూ విడుదల చేసిన వీడియోలో శింబు స్టైలిష్‌గా కనిపించబోతున్నట్టు చెప్పకనే చెబుతున్నాయి విజువల్స్. శింబు ఇన్నోవాలో కొత్త క్రిమినల్ రూపంలో పిస్తోల్ చేతబట్టుకొని స్టైలిష్ ఎంట్రీ ఇస్తున్న విజువల్స్ సినిమాపై అంచనాలు పెంచేస్తూ..సూపర్ బజ్ క్రియేట్ చేస్తున్నాయి.
మేకర్స్ థగ్ లైఫ్ టీంతో కట్ చేసిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ మూవీకి ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తుండగా.. కమల్ హాసన్-ఉదయనిధి స్టాలిన్ సమర్పణలో రాజ్‌కమల్ ఫిలిం ఇంటర్నేషనల్, రెడ్ జియాంట్ మూవీస్, మద్రాస్ టాకీస్ బ్యానర్లపై కమల్ హాసన్-ఆర్ మహేంద్రన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
#ThugLife | Silambarasan 📸 pic.twitter.com/wU0Bv2jkAH
— Christopher Kanagaraj (@Chrissuccess) August 25, 2024
Toofan | ఓటీటీలోకి విజయ్ ఆంటోనీ తుఫాన్.. ఏ ప్లాట్ఫాంలోనంటే..?
Raayan | రాయన్ సక్సెస్ ట్రీట్.. ధనుష్‌కు ఒకేసారి రెండు చెక్కులు