SIIMA Awards -2023 | సౌత్ ఇండియా ఇంటర్నేషనల్ మూవీ అవార్ట్స్ – 2023 (SIIMA) వేడుక దుబాయ్ (Dubai) లో అట్టహాసంగా జరుగుతోంది. రెండు రోజులపాటు జరగనున్న ఈ వేడుక దుబాయ్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్లో 15వ తేదీన ఘనంగా ప్రారంభమైంది. మొదటిరోజు తెలుగు, కన్నడ స్టార్స్ హాజరయ్యారు. టాలీవుడ్ యంగ్‌టైగర్ ఎన్టీఆర్, రానా, రిషబ్ శెట్టి, రక్షిత్ శెట్టి, రామ్ మిరియాల, మృణాల్ ఠాకూర్, అడవి శేష్, శ్రుతి హాసన్, శ్రీలీల, శ్రీనిధి, అశ్వినీ దత్, నిఖిల్ సహా పలువురు స్టార్స్ పాల్గొని సందడి చేశారు.
కాగా, 2023 సంవత్సరానికి గానూ ఉత్తమ నటుడిగా ఎన్టీఆర్ (Jr NTR) అవార్డును అందుకున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ (RRR) చిత్రానికి గానూ ఎన్టీఆర్‌కు ఈ అవార్డు వరించింది. ‘ధమాకా’ చిత్రానికి గానూ ఉత్తమ నటిగా శ్రీలీలకు అవార్డు వరించింది. ఇక ఉత్తమ చిత్రంగా సీతారామం, ఉత్తమ దర్శకుడిగా రాజమౌళి ఎంపికయ్యారు. ఉత్తమ సహాయ నటుడిగా రానా (భీమ్లా నాయక్), ఉత్తమ సహాయ నటిగా సంగీత (మసూద)కు అవార్డులు వరించాయి.
Also Read..
Shruti Haasan | పెళ్లీ గిల్లీ అంటూ బోరింగ్ ప్రశ్నలొద్దు.. నెటిజన్‌కు శృతి హాసన్ రిక్వెస్ట్
Vande Bharat Express: స్లీపర్ కోచ్‌లతో వందేభారత్.. నాన్ ఏసీ ప్రయాణికుల కోసం వందే మెట్రో