Deepika Padukone | దీపిక రీసెంట్ బ్లాక్బాస్టర్ ‘జవాన్’ ఇప్పటికే 700కోట్ల మార్క్‌ను దాటి దూసుకుపోతున్నది. ఆమె మాత్రం ఆ సినిమాకు పారితోషికమే తీసుకోలేదంట. ఈ విషయాన్ని స్వయంగా ఆమే చెప్పారు. ‘జవాన్’ పారితోషికం విషయంలో తనపై వస్తున్న వార్తలను ఖండించారు దీపికాపడుకోన్ ఆమె మాట్లాడుతూ-“జవాన్’ విజయం నాకు చాలా ఆనందాన్నిచ్చింది. ఈ సినిమా ఛాన్స్ వచ్చినప్పుడు పారితోషికం గురించి డిస్కస్ చేయలేదు. పైగా అది ప్రత్యేకపాత్ర అయినా ఇష్టంతోనే చేశాను.
రీసెంట్గా థియేటర్లో ఈ సినిమా చూశాను. నా పాత్ర అద్భుతం అనిపించింది. ఆ ఎపిసోడ్ వరకూ నేనే హీరోయిన్ని. అరుదుగా దొరికే పాత్ర అది’ అంటూ ఆనందం వెలిబుచ్చారు దీపిక. ‘జవాన్’ వెయ్యికోట్ల మార్క్‌ను చేరుకోబోతున్నది. మరి ఇప్పటికైనా అడగరా పారితోషికం? అనడిగితే ‘ఇస్తే ఎందుకు తీసుకోను?’ అంటూ అందంగా నవ్వేశారు దీపిక.