Jack | డీజే టిల్లుతో సూపర్ క్రేజ్ సంపాదించుకున్నాడు సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) . ఈ క్రేజీ యాక్టర్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెట్టగా.. వీటిలో మోస్ట్ క్రేజీయెస్ట్ ప్రాజెక్ట్ జాక్ (Jack). SVCC 37 ప్రాజెక్టుగా వస్తోన్న ఈ చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నాడు.
చాలా రోజుల తర్వాత రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ స్పెషల్ పోస్టర్ విడుదల చేశారు మేకర్స్. సిద్ధు జొన్నలగడ్డ ఈ సారి ఫకీర్ బాబా అవతారమొత్తి.. తనదైన స్టైల్ గెటప్‌తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తున్నాడు. జాక్.. ఇది కేవలం ఒక పేరు కాదు.. ఇది ఒక వైబ్.. ఇంకా ఛేదించాల్సిన మిస్టరీ.. జాక్ టీం నుంచి అందరికీ ఈద్ ముబారక్ అంటూ షేర్ చేసిన లుక్ నెట్టింట టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.
ఇప్పటికే షేర్ చేసిన జాక్ టైటిల్ లుక్ పోస్టర్లో సిద్ధు గన్స్ పట్టుకుని ఫుల్ యాక్షన్ మోడ్‌లో కనిపిస్తూ సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి Achu Rajamani మ్యూజిక్ అందిస్తున్నారు. సిద్దు జొన్నల గడ్డ మరోవైపు నీరజ కోన డైరెక్షన్లో తెలుసు కదా సినిమాలో కూడా నటిస్తున్నాడని తెలిసిందే. దీంతోపాటు టిల్లు 3 కూడా లైన్లో పెట్టగా.. దీనికి సంబంధించి నయా అప్డేట్ రావాల్సి ఉంది.
#Jack is not just a name…
It’s a vibe.
It’s a mystery yet to unfold. 😉Wishing you all Eid Mubarak from Team #Jack ❤️
A Crackling experience awaits in theatres on April 10th 🔥#SidduJonnalagadda @iamvaishnavi04 @baskifilmz #AchuRajamani @SamCSmusic @sureshbobbili9… pic.twitter.com/GIa81WgG0B
— BA Raju’s Team (@baraju_SuperHit) March 31, 2025
Prabhas Spirit | మెక్సికోలో షూటింగ్.. ప్రభాస్ స్పిరిట్ అప్డేట్ పంచుకున్న సందీప్ వంగా
Lucifer 2 Empuraan | మోహన్ లాల్ ‘ఎల్2 ఎంపురాన్’ సినిమాపై 17 సెన్సార్ కట్స్
Pawan Kalyan | ఉగాది రోజు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కి కిక్కిచ్చే న్యూస్.. ఇక సమయం లేదు మిత్రమా..!